సైబర్ వార్ తో అభిమన్యుడు!

abhimanyudu movie trailer talk
Highlights

విశాల్, సమంతా జంటగా దర్శకుడు మిత్రన్ తెరకెక్కించిన చిత్రం 'ఇరుంబు తిరై'. ఇటీవల 

విశాల్, సమంతా జంటగా దర్శకుడు మిత్రన్ తెరకెక్కించిన చిత్రం 'ఇరుంబు తిరై'. ఇటీవల తమిళంలో విడుదలైన ఈ సినిమా మంచి విజయమే దక్కింది. ఇదే సినిమా 'అభిమన్యుడు' పేరుతో తెలుగులో విడుదల కాబోతుంది. జూన్ 1న విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం. విశాల్ ఈ సినిమాలో మిలిటరీ ట్రైనింగ్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. రాజకీయం.. లంచం.. అవినీతి.. అంటూ విశాల్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది.

ఇక ట్రైలర్ లో విశాల్ కంటే విలన్ క్యారెక్టర్ పోషించిన అర్జున్ పాత్రను బాగా హైలైట్ చేశారు. 
''ఇంతకముందు జరిగిన యుద్ధాలన్నీ వెపన్ వార్ ఆ తరువాత బయోవార్ ఇప్పుడు సైబర్ వార్..'' 
''ఇన్ఫర్మేషన్ ఈజ్ పవన్ డేటాను సరిగ్గా ఉపయోగించుకోవడం తెలిసిన వాడికి అది ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు ఆయుధం'' అంటూ అర్జున్ పలికిన డైలాగ్స్ కథపై ఆసక్తిని పెంచుతున్నాయి. 

 

loader