బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ 52వ రోజు ఇంటిసభ్యులకు అదిరిపోయే టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్‌. `బేబీ డే కేర్‌` పేరుతో టాస్క్ పెట్టాడు. అమ్మా రాజశేఖర్‌, అవినాష్‌, అరియానా, హారిక, మెహబూబ్‌ చిన్నపిల్లలుగా, మోనాల్‌, అభిజిత్‌, అఖిల్‌, నోయల్‌, సోహైల్‌ కేర్‌ టేకర్లుగా వ్యవహరించారు. చిన్నపిల్లలు కేర్‌ టేకర్లకి చుక్కలు చూపించారు.  దీనికి కొనసాగింపుగా 53వ రోజు ఎపిసోడ్‌ ప్రసారం కానుంది. 

ఈ సందర్భంగా పలు ప్రోమోలని విడుదల చేశారు స్టార్‌ మా. ఇందులో ఓ ప్రోమోలో అమ్మా రాజశేఖర్‌, మోనాల్‌ మధ్య, హారికా, అభిజిత్‌ మధ్య ఫైటింగ్‌ జరిగింది. నేను ఇన్‌వాల్స్ కాను అని మోనాల్‌ అనగా అందుకు అమ్మా రాజశేఖర్‌ ఫైర్‌ అయ్యరు. నేను అదే చెబుతున్నాంటూ అంటూ స్వరం పెంచాడు. మొదటిసారి వీరిద్దరి మధ్య వాగ్వాదం జరగడం దీంతో హౌజ్‌ ఒక్కసారిగా హీటెక్కింది. 

దీంతోపాటు అభిజిత్‌, హారికల మధ్య మరో వివాదం రాజుకుంది. వీరిద్దరు కూడా చాలా ఫ్రీగా ఉంటారు. హారిక `నువ్వు అప్పుడే చెప్పాల్సింద`ని హారిక.. అభిజిత్‌ని ఉద్దేశించి అనగా, అందుకు అభిజిత్‌ స్పందిస్తూ, నేను ఎప్పుడు మాట్లాడాలో నువ్వు నాకు నేర్పకు.. నేనేమన్న బేకారు గాన్నా..` అంటూ గట్టిగా బదులిచ్చాడు. దీంతో హారిక అక్కడి నుండి వెళ్లిపోయింది. దీంతో మరింత వేడిని పెంచిందీ సన్నివేశం. బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌పై ఆసక్తిని రేకెత్తిస్తుంది.