Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు ఫిబ్రవరి 14వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.
ఈరోజు ఎపిసోడ్ లో యష్ జరిగిన విషయాలు తలుచుకొని అనవసరంగా వేద మీద కోప్పడ్డాను అనుకున్న సారీ చెప్పడానికి ప్రయత్నించగా వేద పక్కకు వెళ్లిపోతుండగా వేద చేయి పట్టుకొని ఐ యాం రియల్లీ వెరీ వెరీ సారీ వేద నీ విషయంలో చాలా తప్పుగా ప్రవర్తించాను. నీ మీద కోపంగా అరిచేసాను ఏమీ అనుకోవద్దు అని అంటాడు. నేను అలా చేసి ఉండకూడదు, ఎందుకంటే నువ్వు ఏం చెప్పినా ఏం చేసినా నా మంచి కోసమే చేస్తావు అని అంటాడు. ఎవరు చెప్పారండి నేను అలిగాను అని హర్ట్ అయ్యానని మీరు కోప్పడడానికి నేనేం బాధపడలేదు భర్త కోప్పడితే దాని వెనుక ఉన్న కారణం గురించి భార్య ఆలోచిస్తుంది అని అంటుంది వేద. మాళవిక గురించి ఆలోచించలేదు తన దగ్గర ఉన్న మన అబ్బాయి ఆదిత్య గురించి అని అంటుంది వేద.
లేదా నా కోపాన్ని భరించడం నీకు ఈజీనేమో కానీ, నీ మంచితనాన్ని భరించడం మాత్రం చాలా కష్టం అని అనగా వేద నవ్వుకుంటూ ఉంటుంది. నువ్వు ఎంత మంచి దానివి వేద నీకు హాని తల పెట్టాలని చూసినా కూడా నువ్వు మంచి చేయాలని చూస్తున్నావు. నువ్వు చాలా మంచి దానివి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత వేద ఒకచోట కూర్చుని విన్నీ అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. విని చెప్పింది నిజమేనా అందరికీ లైఫ్ లో మళ్ళీ సెకండ్ ఛాన్స్ రాధా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు అభి ఇప్పుడు ఏమైంది అక్క నువ్వు ఎందుకు అంతగా సీరియస్ గా తీసుకుంటున్నావు పార్టీలో కొంచెం ఎక్కువైతే ఏదో వాగాను దానికి ఇంత అవసరమా అని అంటాడు.
చిన్న విషయం ఏంటి అభి నువ్వు మాళవికను పెళ్లి చేసుకోను అని అందరికీ చెప్పావు అనగా లేదు అక్క విన్నీ ముందు మాత్రమే చెప్పాను విన్నీ మనమనిషి అని అంటాడు. కొన్ని కొన్ని సార్లు నువ్వు నోరు అదుపులో పెట్టుకుని ఉండాలి లేదంటే అది అవతలి వాళ్లకు బలం అవుతుంది. ఇప్పుడు ఎలా అయితే ఎస్ మీద గెలిచావో ప్రతిసారి నువ్వు యష్ మీద అలాగే గెలవాలి అది నేను చూడాలి అంటుంది బ్రమరాంబిక. మాళవికను మనం వీలైనంత తొందరగా వదిలించుకోవాలి అనడంతో అందుకే అక్క చిత్ర అనే ఒక అమ్మాయిని ట్రై చేస్తున్నాను.
తనకి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయ్యింది అనడంతో ఎందుకు తమ్ముడు అలాంటి వాళ్ళు అనగా చిత్రానీ పెళ్లి చేసుకుంటే వసంత్ దెబ్బతింటాడు వసంత్ దెబ్బ తింటే యష్ కీ అది అవమానం అది నాకు కావాలి అంటాడు అభి. ఎలా అయినా చిత్రను లొంగ తీసుకొని ఆ యశోదర్, వేద ఫ్యామిలీని చెడగొట్టాలి అనుకుంటూ ఉంటాడు అభి. మరోవైపు వేద చిత్రతో మాట్లాడుతూ ఆ మాళవికకు ప్రమాదం ఉంది అని చెప్పాను కదా కానీ ఆ మాళవిక మాత్రం అభిమన్యుని గుడ్డిగా నమ్ముతోంది. తనకు మంచి జరగాలని నేను మీ బావగారు ప్రయత్నిస్తున్నాము. కానీ తను మమ్మల్ని నమ్మడం లేదు అంటుంది వేద. మనం ఇప్పుడు ఏం చేయలేము కదా అక్క అదంతో చేయాలి చిత్ర అంటుంది వేద.
అప్పుడు వాళ్ళిద్దరూ మాళవిక గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత యష్ పని చేసుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి వేద వస్తుంది. అప్పుడు వేద, యష్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది. అప్పుడు వేద, చిత్ర చెప్పినట్టు చేద్దామా యష్ కీ మనసులో ఉన్న మాటలు చెబుదామ అనుకుంటూ ఉంటారు. అప్పుడు వేద, యష్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు అనగా ఏం లేదు మా ఫ్రెండ్ గురించి ఆలోచిస్తున్నాను అనడంతో ఎవడు వాడైనా అనగా తను ఒక విషయం చెప్పాడు ఆ విషయం గురించి నిన్నటి నుంచి ఆలోచిస్తున్నాను అంటుంది వేద. అప్పుడు వేద సెకండ్ ఛాన్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి అని అంటుంది.
లైఫ్ లో ప్రతి ఒక్కరికి సెకండ్ ఛాన్స్ వస్తుంది కదా, అంటే రెండోసారి ప్రేమ పుట్టడం గురించి మీరు ఏమంటారు అని అంటుంది వేద. అప్పుడు యశోదర్ చూడు వేద ప్రేమను మించిన పిచ్చి పని మరొకటి లేదు అనడంతో వేద షాక్ అవుతుంది. పిచ్చి పని ఒక్కసారి చేయడమే తప్పు మళ్ళీ మళ్ళీ చేయడం కూడానా అని అంటాడు. మనిషికి ప్రేమ పుట్టినప్పుడు గుండె గాడి తప్పుతుంది, విచక్షణ కోల్పోతాము. జీవితం తలకిందులు అయిపోతుంది అని యష్ మాట్లాడడంతో వేద కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఒకసారి తెలియక తప్పు చేశాను. ఇప్పటివరకు ఆ గాయాలు మానలేదు మళ్లీ మళ్లీ తప్పు చేయలేను అని అంటాడు. అప్పుడు వేద కన్నీళ్లు పెట్టుకుంటుంది.
