రాజకీయలు ఎన్ని తప్పటడుగులు వేస్తున్నా.. అధికారులు ఎటువైపు నడిచిన ఆయన పాదం మాత్రం నిజం వైపే నడిచింది. నిజాయితీగా రాష్ట్రపతిగా ఉన్నంత కాలం కలామ్ తెచ్చుకున్న గుర్తింపు చరిత్రలో నిలిచిపోయింది. వచ్చిన జీతం తప్ప అక్రమంగా పైసా ఆస్తిని కూడా వెనకేసుకోలేదు. అలాంటి నిజమైన మనిషి బయోపిక్ తెరకెక్కుతోంది అంటే అందరూ  ఆసక్తిగా ఎదురుచూస్తారనడంలో సందేహం లేదు. 

ప్రస్తుతం అందుకు సంబందించిన అడుగులు పడుతున్నాయి. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర అలాగే అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నట్లు ఇప్పటికే ఒక ప్రకటన వెలువడింది. అయితే సినిమాలో కలామ్ పాత్రలో నటించేదేవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదు. ఇటీవల బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ ని కలిసిన నిర్మాతలు చర్చలు జరుపగా అనిల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

అయితే అనిల్ ఒకే చెప్పింది అబ్దుల్ కలామ్ పాత్రకేనా అనే విషయంలో కూడా క్లారిటీ రావాల్సి ఉంది.  వేపన్స్ ఆఫ్ పీస్ పుస్తకం ద్వారా రాజ్ చెంగప్ప స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. దర్శకుడిని కూడా ఇంకా ఫిక్స్ చేయాల్సి ఉంది. త్వరలోనే సినిమా నటీనటులను ఇతర సంకేతిక నిపుణులను ఫైనల్ చేసి షూటింగ్ మొదలుపెట్టాలని అనిల్ సుంకర ప్రయత్నాలు చేస్తున్నారు.