గత కొంత కాలంగా వరుస అపజయాలను ఎదుర్కొంటున్న అల్లు బ్రదర్ అల్లు శిరీష్ ఈ సారి హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. మలయాళం సక్సెస్ ఫుల్ స్టోరీ ఎబిసిడి రీమేక్ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. అల్లు శిరీష్ సరసన ఋక్షర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఫైనల్ గా సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేసింది. ట్రైలర్ తో శిరీష్ సరికొత్తగా ఆకట్టుకున్నాడని చెప్పవచ్చు. అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన కోటీశ్వరుడి కొడుకు ఎలాంటి పాట్లు పడి మారిపోయాడు అనేదే అసలు కథ. డబ్బు విలువ తెలియని కొడుకుకి పూర్ లైఫ్ ని పరిచయం చేసే తండ్రిగా నాగబాబు నటించారు. 

ఈ ఫార్మట్ అందరికి తెలిసిందే అయినా శిరీష్ మాత్రం కొత్తగా ప్రజెంట్ చేయాలనీ ప్రయత్నిస్తున్నాడని అనిపిస్తోంది. మరి సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియాలంటే ఈ నెల 17వరకు వెయిట్ చేయాల్సిందే. మధుర శ్రీధర్ నిర్మించిన ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్ తో కలిసి రిలీజ్ చేస్తున్నారు.