నారా రోహిత్ ఆటకు జగపతి బాబు ఫినిషింగ్!

First Published 9, Jun 2018, 3:00 PM IST
aatagallu movie teaser talk
Highlights

నారా రోహిత్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న చిత్రం 'ఆటగాళ్ళు'

నారా రోహిత్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న చిత్రం 'ఆటగాళ్ళు'. ఇటీవల సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన చిత్రబృందం తాజాగా సినిమా టీజర్ ను విడుదల చేశారు. ఇందులో జాపతిబాబు.. 'ఆట నువ్వు మొదలుపెట్టావు.. నేను ఫినిషింగ్ ఇస్తాను' అనే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. 

పరుచూరి మురళి డైరెక్ట్ చేసిన ఈ సినిమా మర్డర్ మిస్టరీ నేపధ్యంలో సాగనుంది. హీరో తన భార్యను చంపిన కేసులో ఇరుక్కుంటే.. రోహిత్ ను విచారించే లాయర్ పాత్రలో జగపతి బాబు కనిపించనున్నారు. ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

loader