బిగ్ బాస్ 7లో ఫస్ట్ కంటెస్టెంట్ గా కంఫర్మ్ అయిన ఆట సందీప్.. పవర్ అస్త్ర టాస్క్ లో ప్రియాంకపై విజయం
నాగార్జున పవర్ అస్త్ర పోటీలో ఫైనల్ కి చేరిన ఆట సందీప్, ప్రియాంక జైన్ లకు ఆసక్తిర టాస్క్ ఇచ్చారు. పవర్ అస్త్ర కోసం ఈ పోటీ. అది సాధిస్తే హౌస్ లో ప్లేస్ పదిలం కావడంతో పాటు పలు ఉపయోగాలు ఉంటాయి.

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 తొలి వారం అంతా గందరగోళంగా మారింది. అంతా మారిపోయింది అని చెప్పారు కానీ.. గందరగోళం అవుతోందనే కామెంట్స్ ఆడియన్స్ నుంచి వినిపిస్తున్నాయి. శనివారం వీకెండ్ కావడంతో హౌస్ మేట్స్ కి క్లాస్ పీకేందుకు, ఆడియన్స్ ని పలకరించేందుకు నాగార్జున వేదికపైకి ఎంట్రీ ఇచ్చారు.
బిగ్ బాస్ మొదలై ఫస్ట్ వీక్ కావడంతో నాగార్జున పెద్దగా షాకులు ఇవ్వకుండానే ఇంటి సభ్యులతో సరదాగా మాట్లాడారు. మధ్యలో తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఇక హౌస్ శుభశ్రీని యావర్ యూజ్ లెస్ అని తిట్టడం కాస్త వివాదంగా మారింది. నాగార్జున ఇంటి సభ్యులని ఒక్కఒక్కరిని పైకి లేపి వారి పెర్ఫామెన్స్ గురించి మాట్లాడారు.
శివాజీ యాక్టింగ్ టాస్క్ లో అదరగొట్టాడు అంటూ నాగార్జున ప్రశంసించారు, ఇక శోభా శెట్టి మాటిమాటికి హౌస్ లో ఏడుస్తుండడంతో.. ఫస్ట్ వీక్ లోనే ఏడ్చేవాళ్ళు బిగ్ బాస్ లో ఎప్పుడూ టాప్ 5లో లేరు అని నాగార్జున వార్నింగ్ ఇచ్చారు. ఇక టేస్టీ తేజ శోభా శెట్టిని హాట్ అని పిలిచాడు. దీనితో నాగార్జున శోభా శెట్టికి ముందుగా చెప్పినట్లుగా శిక్ష విధించారు.
హౌస్ లో ఎవరైనా నిన్ను హాట్ గా ఉన్నావ్ అంటే శిక్ష విధిస్తా అని నాగార్జున ఫస్ట్ డే నే శోభాకి చెప్పారు. ముందుగా చెప్పినట్లుగానే శిక్ష విషించారు. వారం రోజుల పాటు శోభా శెట్టి హౌస్ లో వాష్ రూమ్స్ క్లీన్ చేయాలని ఆదేశించారు. హాట్ గర్ల్ వాష్ రూమ్ క్లీన్ చేస్తుంటే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు అంటూ సెటైర్ వేశారు
ఇక రతిక రోజ్ ప్రతిభని నాగార్జున అభినందించారు. బిగ్ బాస్ ఉడతా ఉడతా సాంగ్ ప్లే చేసినప్పుడు.. ఎన్ని ఉడత పదాలు వచ్చాయో కరెక్ట్ గా లెక్కించి చెప్పింది అని నాగార్జున అన్నారు. దీనితో నాగ్ ఆమెకి అదనపు మార్కులు జోడించి ప్రశంసించారు.
ప్రశాంత్ బీస్ట్ టాస్క్ లో అద్భుతంగా పెర్ఫామ్ చేసాడు అని ప్రశంసించిన నాగార్జున.. ఒకరి వెనుక తిరిగుతున్నావ్ అంటూ రతిక రోజ్ తో ప్రేమాయణం గురించి సెటైర్లు వేసారు. నేను నీకిచ్చిన మొక్కని వదిలేసి రోజ్ వెంట పడుతున్నావ్ అని నాగార్జున చెప్పడంతో ఇతర సభ్యుల ముఖాల్లో నవ్వులు విరిశాయి.
ఇక నాగార్జున పవర్ అస్త్ర పోటీలో ఫైనల్ కి చేరిన ఆట సందీప్, ప్రియాంక జైన్ లకు ఆసక్తిర టాస్క్ ఇచ్చారు. పవర్ అస్త్ర కోసం ఈ పోటీ. అది సాధిస్తే హౌస్ లో ప్లేస్ పదిలం కావడంతో పాటు పలు ఉపయోగాలు ఉంటాయి. త్రాచు లాంటి బల్లపై చెరొక వైపు సందీప్, ప్రియాంక ఉంటారు. మధ్యలో స్మైలీ బాల్స్ ఉంటాయి. ఆ బాల్స్ ని తీసుకుని బల్లపై నుంచి కింద పడకుండా ఎవరికి కేటాయించిన బుట్టలో వాళ్ళు వేయాలి.
ఈ టాస్క్ లో అత్యధిక స్మైలీ బాల్స్ బుట్టలో వేసి ఆట సందీప్ విజయం సాధించాడు. హౌస్ లో తొలి కంటెస్టెంట్ గా నిలిచాడు. దీనితో నాగార్జున సందీప్ కి పవర్ అస్త్ర అందించారు.