సినీ నటి ఆర్తి చాబ్రియా వివాహం ఘనంగా జరిగింది. విశరధ్‌ బీడసీ అనే చార్టెడ్ అకౌంటర్ ని సోమవారం నాడు ఆర్తి వివాహం చేసుకొంది. ముంబైలో జరిగినఈ వేడుకకు పలువురు సినీ నటులు హాజరయ్యారు.

ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం.. మార్చి 11న ఆర్తి, విశరధ్‌ ల ఎంగేజ్మెంట్ జరిగింది. విశరధ్‌ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పని చేస్తున్నారు.

త్వరలోనే ఆయన ముంబైకి షిఫ్ట్ కాబోతున్నారు. బాలీవుడ్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన ఆర్తి.. 2003లో తెలుగులో 'ఒకరికి ఒకరు' సినిమాలో నటించింది. ఆ తరువాత తెలుగులో 'ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి', 'గోపి గోడమీద పిల్లి' వంటి చిత్రాల్లో నటించింది.

వెంకటేష్ నటించిన 'చింతకాయల రవి' సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించింది. చివరిగా 2013లో ఓ పంజాబీ సినిమాలో కనిపించిన ఆమె ఆ తరువాత నటనకు గుడ్ బై చెప్పేసింది.