సాధారణంగా సెలబ్రిటీలు ఎక్కువగా బిజినెస్ క్లాస్ లో ప్రయాణించడానికే ఆసక్తి చూపుతుంటారు. ఇక స్టార్ హీరోలు, హీరోయిన్లు అయితే ఎకానమీ జోలికి కూడా వెళ్లరు. అభిమానుల్లో వారికుండే క్రేజ్ కారణంగా ఎకానమీ క్లాస్ లో ప్రయాణిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని బిజినెస్ క్లాస్ లోనే ప్రయాణం చేస్తుంటారు.

అయితే బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మాత్రం సాధారణ ప్రయాణికుడిగా ఎకానమీ క్లాస్ కి కనిపించేసరికి అభిమానులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆయన మాత్రం సింపుల్ గా నవ్వుతూ విండో సీట్ లో కూర్చున్నారు.

ఈ సందర్భంగా కొందరు అభిమానులు తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన ఆమిర్ అభిమానులు రియల్ హీరో అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆమిర్ సింప్లిసిటీని పొగుడుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ హీరో 'లాల్ సింగ్ చద్దా' అనే సినిమాలో నటిస్తున్నారు.   

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#ripbusinessclass 😛 #aamirkhan

A post shared by Viral Bhayani (@viralbhayani) on Apr 22, 2019 at 7:34am PDT