రాజమౌళి మామూలోడు కాదు..అమీర్ ఖాన్ ని లాక్కొస్తున్నాడు

ఆ మేరకు అమీర్ ఖాన్ తో రాజమౌళి మీట్ అయ్యారు. రాజమౌళి స్వయంగా అమీర్ సహాయం కోరటంతో..హిందీ వెర్షన్ ప్రమోషన్స్ కి అమీర్ అంగీకరించారని సమాచారం. అంతేకాదు ఈ ప్రాజెక్టుకు క్రేజ్ తేవటానికి...ఆర్.ఆర్.ఆర్ హిందీ వెర్షన్ లో ఎన్టిఆర్ (భీమ్).. రామ్ చరణ్ (రామరాజు) పాత్రలను పరిచయం చేయడానికి అమీర్ ఖాన్ వాయిస్ ఓవర్ చెప్తారట.

Aamir Khan To Introduce NTR and Ram Charan! jsp

రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఆర్.ఆర్.ఆర్ హిందీ వెర్షన్ లో కీలక పాత్రల పరిచయానికి అమీర్ ఖాన్ గొంతును అరువివ్వనున్నారనే వార్త ఇప్పుడు మీడియాలో హల్ చేస్తోంది. ఆ మేరకు అమీర్ ఖాన్ తో రాజమౌళి మీట్ అయ్యారు. రాజమౌళి స్వయంగా అమీర్ సహాయం కోరటంతో..హిందీ వెర్షన్ ప్రమోషన్స్ కి అమీర్ అంగీకరించారని సమాచారం. అంతేకాదు ఈ ప్రాజెక్టుకు క్రేజ్ తేవటానికి...ఆర్.ఆర్.ఆర్ హిందీ వెర్షన్ లో ఎన్టిఆర్ (భీమ్).. రామ్ చరణ్ (రామరాజు) పాత్రలను పరిచయం చేయడానికి అమీర్ ఖాన్ వాయిస్ ఓవర్ చెప్తారట.

ఇక అన్ని దక్షిణాది భాషలలో భీమ్ (ఎన్టీఆర్) ఇంట్రడక్షన్ కోసం రామరాజు (రామ్ చరణ్).. రామరాజు  రామ్ చరణ్ పరిచయం కోసం ఎన్టీఆర్ తన గొంతును ఇచ్చారు. హిందీ లో అమీర్ గొంతు వినటం పండగ లాంటిదంటున్నారు. ఆర్.ఆర్.ఆర్ పాన్ ఇండియా సినిమా కావటంతో ఈ మాత్రం జాగ్రత్తలు ప్రమోషన్ విషయంలో తీసుకోకపోతే కష్టం. దానికి ఆలియాభట్.. అజయ్ దేవగన్ లాంటి స్టార్లు ఆర్.ఆర్.ఆర్ లో కీలక పాత్రలు పోషించడం అక్కడ మార్కెట్ కి పెద్ద ప్లస్ అవనుందని తెలుస్తోంది.  
 
ఇక ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడికల్‌ మల్టీస్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’  (రౌద్రం రణం రుధిరం). ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కొమరం భీమ్, రామ్‌ చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రల్లో కనిపించనున్నారు. సినిమా మొత్తంలో పలు గెటప్స్‌లో కనిపిస్తారట ఈ ఇద్దరు హీరోలు. బ్రిటిష్‌ అధికారులను ఎదుర్కొనే ప్రయత్నంలో రకరకాల గెటప్స్‌ వేసి వాళ్లను తెలివిగా ఢీ కొంటారని చెప్తున్నారు. పోలీస్‌ ఆఫీసర్‌గా చరణ్, బందిపోటు గెటప్‌లో ఎన్టీఆర్‌ కనిపిస్తారట.

మరికొన్ని గెటప్స్‌లోనూ ఎన్టీఆర్, చరణ్‌లు కనిపిస్తారని తెలిసింది. ఈ స్పెషల్‌ గెటప్స్‌ సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటాయట. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరిస్, చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ నటించనున్నారు. ప్రస్తుతం కరోనా వల్ల షూటింగ్‌కి అంతరాయం ఏర్పడింది. త్వరలోనే తిరిగి సెట్స్‌ మీదకు వెళ్లనుంది చిత్ర టీమ్. ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios