Asianet News TeluguAsianet News Telugu

చెన్నైకి షిప్ట్ అవుతున్న ఆమీర్ ఖాన్, బాలీవుడ్ ను వదిలేస్తున్నారా..? కారణంఏంటి..?

ఆమీర్ ఖాన్ ముంబయ్ ను వదిలి చెన్నై షిప్ట్ అవుతున్నారా..?  బాలీవుడ్ ను ఆమీర్ ఖాన్ వదిలేస్తున్నారా..? చెన్నై వెళ్తున్నారనడంలో నిజం ఎంత..? చెన్నై వెళ్ళడానికి కారణం ఏంటి..? 
 

Aamir Khan Shifting to Chennai Due To His Mother Treatment JMS
Author
First Published Oct 21, 2023, 1:17 PM IST

బాలీవుడ్ లో మిస్టర్ పర్ఫెక్ట్ ఇమేజ్ తో దూసుకుపోతున్నారు ఆమీర్ ఖాన్. బీటౌన్ లో ఖాన్ త్రయంలో...ఆమీర్ సపరేట్ ఇమేజ్ సాధించారు. ప్రయోగాలకు పెట్టింది పేరుగా ఆయన ఉన్నారు. అంతే కాదు నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా మల్టీ రోల్స్ ప్లే చేసి.. బాలీవుడ్ ను ఓ మెట్టు ఎక్కించడంలో కీలక పాత్ర పోషించారు ఆమీర్ ఖాన్. ఈ ఏజ్ లో కూడా తన బాడీని ఏ పాత్రకైనా సిద్ధం చేయగల సిద్ధహస్తుడు ఆమీర్ ఖాన్. తాజాగా ఆయన ముంబాయి నుంచి మకా మార్చబోతున్నట్టు తెలుస్తోంది. దీనికి కారణం ఏంటి..? 

బాలీవుడ్ లో అగ్రహీరోగా  వెలుగు వెలుగుతున్న  ఆమిర్ ఖాన్ చెన్నైకి మకాం మార్చనున్నారు.  ముంబయిలో శాశ్వత  నివాసం కలిగి ఉన్న  అమీర్ ఖాన్ రాబోయే రెండు నెలల మాత్రమే.. తాత్కాలికంగా  చెన్నైలోనే ఉండనున్నారు. ఆయన చెన్నైలో ఉండాలని నిర్ణయించుకోవడానికి కారణం ఆయన తల్లి. అవును ఆమిర్ ఖాన్ తల్లి ప్రస్తుతం అనారోగ్యం కారణంగా చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తల్లితో ఎంతో అనుబంధం కలిగి ఉన్న ఆమిర్ ఖాన్... ఆమెను దగ్గరుండి చూసుకునేందుకు తాత్కాలికంగా ముంబయిన వీడి చెన్నైలో ఉండాలని నిర్ణయించుకున్నారు. 

అయితే ఆయన చెన్నైలో ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టుతెలుస్తోంది. తన తల్లి చికిత్స పొందుతున్న ఆసుపత్రికి దగ్గర్లోనే ఓ హోటల్లో ఉండాలని ఆమిర్ ఖాన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం  జాతీయ మీడియాలో వైరల్ అవుతోంది.  ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ఇచ్చాడు ఆమీర్. హీరోగా సినిమాలు చేస్తాడో చేయడో అన్న అనుమానం ఉంది ఫ్యాన్స్ లో. 

ఆమిర్ ఖాన్ చివరగా  లాల్ సింగ్ చద్ధా సినిమాలో నటించాడు. ఈసినిమా స్టోరీ బాగున్నా.. సినిమా పెద్దగా హిట్ టాక్ సాధించలేకపోయింది. హాలీవుడ్ హిట్ చిత్రం ఫారెస్ట్ గంప్ కు ఇది రీమేక్.  కానీ, లాల్ సింగ్ చద్ధా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా ద్వారానే అక్కినేని నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా రిజల్ట్ తరువాతే ఆమీర్ ఖాన్ యాక్టింగ్ కు బ్రేక్ ఇచ్చాడు. అయితే ఆయన నటుడిగా కొనసాగకపోయినా.. నిర్మాణంపై దృష్టి సారిస్తానని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios