Asianet News TeluguAsianet News Telugu

ప్రియుడితో అమీర్ ఖాన్ కుమార్తె దీపావళి సెలెబ్రేషన్స్.. పక్కనే అత్తగారు కూడా, పెళ్ళికి అంతా రెడీ!

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కుమార్తె  ఐరా ఖాన్ ఇటీవల వార్తల్లో నిలుస్తోంది. ఈ దీపావళిని ఐరా ఖాన్ ప్రత్యేకంగా మార్చుకుంది. తన ప్రియుడు నుపుర్ శిఖరేతో కలసి దీపావళిని సెలెబ్రేట్ చేసుకుంది.

Aamir Khan's daughter Ira Khan celebrates Diwali with boyfriend
Author
Hyderabad, First Published Nov 6, 2021, 1:12 PM IST

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కుమార్తె  ఐరా ఖాన్ ఇటీవల వార్తల్లో నిలుస్తోంది. ఈ దీపావళిని ఐరా ఖాన్ ప్రత్యేకంగా మార్చుకుంది. తన ప్రియుడు నుపుర్ శిఖరేతో కలసి దీపావళిని సెలెబ్రేట్ చేసుకుంది. ఆ ఫోటోస్ ని నుపుర్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 

అందమైన సిల్క్ శారీలో ఐరా ఖాన్ మెరిసింది. వీరిద్దరితో కలసి నుపుర్ తల్లి ప్రీతం శిఖరే కూడా దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు. అంతా స్మైలీ ఫేసెస్ తో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 24  ఏళ్ల ఐరా ఖాన్ గత ఏడాది కాలంగా నుపుర్ తో రిలేషన్ లో ఉంది. ఇటీవల తమ బంధాన్ని ఐరా ఖాన్ అధికారికంగా ప్రకటించింది. 

నుపుర్ బాలీవుడ్ సెలెబ్రెటీలకు ఫిట్ నెస్ ట్రైనర్ గా పనిచేస్తున్నాడు. ఐరా ఖాన్ కు నుపుర్ ఫిట్ నెస్ ట్రైనింగ్ ఇస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సుష్మితా సేన్ కి కూడా ఫిట్ నెస్ ట్రైనర్ గా చాలా కాలం నుంచి పనిచేస్తున్నాడు. 

ఐరా ఖాన్.. అమీర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తాల సంతానం. ఐరా ఖాన్, ఆమె సోదరుడు జునైద్ ఖాన్ ఇద్దరూ అమీర్ ఖాన్ మొదటి భార్య సంతానమే. ఐరా ఖాన్ బాలీవుడ్ లో దర్శకురాలిగా ప్రయత్నిస్తోంది. గతంలో మానసిక సమస్యలతో డిప్రెషన్ లోకి వెళ్లినట్లు కూడా ఐరా ఖాన్ గతంలో తెలిపింది. 

డిప్రెషన్ నుంచి బయట పడిన ఐరా ఖాన్ ప్రస్తుతం సంతోషంగా  ప్రియుడితో రిలేషన్ కొనసాగిస్తోంది. వీరిద్దరి జంటగా ఫంక్షన్స్ కి కూడా హాజరవుతున్నారు. అమిర్ ఖాన్ కుమార్తె అప్పుడే అత్తగారిని కూడా మచ్చిక చేసుకోవడం మొదలు పెట్టింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అటు అమీర్ ఖాన్ వైపు నుంచి.. ఇటు నుపుర్ కుటుంబ సభ్యుల నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో.. పెళ్ళికి అంతా రెడీ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. 

Also Read: శ్రీజ భర్త ఏమైనట్లు.. మెగా ఫోటోలలో మిస్సింగ్.. మొదలైన రూమర్లు ?

ఇదిలా ఉండగా అమీర్ ఖాన్ ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా చిత్రంలో నటిస్తున్నాడు. ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ చైతన్య అమీర్ ఖాన్ కు స్నేహితుడి పాత్రలో నటిస్తున్నాడు. డిసెంబర్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Popeye ⚓ (@nupur_shikhare)

Follow Us:
Download App:
  • android
  • ios