Asianet News TeluguAsianet News Telugu

మూడో పెళ్ళికి అమీర్ ఖాన్ రెడీ ?.. రూమర్స్ పై మిస్టర్ పర్ఫెక్ట్ సమాధానం, ఫ్యామిలీ డీటెయిల్స్ చెబుతూ..

అమీర్ ఖాన్ మూడేళ్ళ క్రితం తన సతీమణి కిరణ్ రావు నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. పరస్పర అంగీకారంతో వీళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు. 

Aamir Khan responds to third marriage rumours dtr
Author
First Published Aug 27, 2024, 11:35 AM IST | Last Updated Aug 27, 2024, 11:35 AM IST

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరు. అమీర్ ఖాన్ నటన కోసం ఎలాంటి ప్రయోగానికైనా సిద్ధం అవుతారు. చాలా మంది సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లో ఊహించని సంఘటనలు జరగడం చూశాం. అమీర్ ఖాన్ కూడా తన పర్సనల్ లైఫ్ తో వార్తల్లో నిలిచారు. 

అమీర్ ఖాన్ మూడేళ్ళ క్రితం తన సతీమణి కిరణ్ రావు నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. పరస్పర అంగీకారంతో వీళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు. అంతకు ముందు 2002లో అమీర్ ఖాన్ తన మొదటి భార్య రీనా దత్తా నుంచి విడిపోయారు. 

ప్రస్తుతం అమీర్ ఖాన్ వయసు 59 ఏళ్ళు. ఇటీవలే తన కుమార్తె ఐరా ఖాన్ వివాహం కూడా చేసారు అమీర్. అయితే అమీర్ ఖాన్ త్వరలో మూడో పెళ్ళికి సిద్ధం అవుతున్నారు అంటూ జోరుగా రూమర్స్ వైరల్ అయ్యాయి. అమీర్ ఖాన్ పర్సనల్ రిలేషన్ షిప్ గురించి సంచనల ప్రచారం కూడా జరిగింది. 

అయితే అమీర్ ఖాన్ ఇటీవల నటి రియా చక్రవర్తి హోస్ట్ గా చేస్తున్న పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ కి అతిథిగా హాజరయ్యారు. ఈ ఇంటర్వ్యూలో రియా.. అమీర్ ఖాన్ మూడో పెళ్లి గురించి ప్రశ్నించింది. మీ వివాహం గురించి రూమర్స్ వస్తున్నాయి అని ప్రశ్నించగా అమీర్ ఖాన్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం నా వయసు 59 ఏళ్ళు. ఈ టైంలో నేను ఎందుకు పెళ్లి చేసుకుంటాను ? ఒంటరిగా జీవించడం కష్టమే.. కానీ నాకు ఫ్యామిలీ ఉంది. తమ్ముళ్లు, చెల్లెల్లు, పిల్లలు ఉన్నారు. స్నేహితులు కూడా ఉన్నారు. 

ఈ విధంగా తన పెళ్లి గురించి వస్తున్న రూమర్స్ ని అమీర్ ఖాన్ ఖండించారు. ప్రస్తుతం తాను పెళ్ళికి సిద్ధంగా లేనని క్లారిటీ ఇచ్చారు. అమీర్ ఖాన్ చివరగా నటించిన లాల్ సింగ్ చద్దా చిత్రం దారుణంగా నిరాశపరిచింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios