Asianet News TeluguAsianet News Telugu

మాజీ భార్య కిరణ్ రావుతో కలిసి అమీర్ ఖాన్ పూజలు, సరికొత్త అవతారంలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్

ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్. కొత్త అవతారం ఎత్తారు.. కొత్త కొత్త పనులు చేస్తూ.. ఆశ్చర్యపరిచారు. మరీ అమీర్ ఖాన్ లో కనిపించిన కొత్తదనం ఏంటంటే..? 

Aamir Khan performs kalash puja at new office with ex wife Kiran Rao
Author
First Published Dec 10, 2022, 7:33 PM IST

తెల్ల జుట్టు, తెల్ల గడ్డంతో పాటు కళ్లద్దాలు, నెహ్రూ టోపీ, మెడల్ కండువాతో అమీర్ ఖాన్ సరికొత్తగా కనిపించారు అమీర్ ఖాన్. అభిమానులను ఆకట్టుకున్నారు.అంతకు మించి తను విడాకులు ఇచ్చిన తన మాజీ భార్య కిరణ్ రావుతో కలిసి పెద్ద స్థాయిలో పూజలు పునస్కారాలు చేస్తున్నాడు. ఈ విచిత్రమైన గెటప్ గురించి అంతా ఆలోచనలో పడితే... ముస్లిమ్ అయిన అమీర్ పూజలు చేయడం.. అది కూడా డివోర్స్ ఇచ్చిన భార్యతో కలిసి చేయడం బాలీవుడ్ లో పెద్ద చర్చగా మారింది.  

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్, తన మాజీ భార్య కిరణ్ రావుతో కలిసి చేసిన ప్రత్యేక పూజల ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. డిసెంబర్ 9 శుక్రవారంనాడు తన కొత్త ఆఫీస్ ను స్టార్ట్ చేశాడు అమీర్. అయితే అవి మామూలుగా కాకుండా.. ఆఫీసుని ప్రత్యేక  పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ముస్లిం అయిన అమీర్, హిందూ ఆచారాలు పాటించడం,  పూజలు జరిపించడం ముంబయ్ సర్కిల్ లో  టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది.. 

కలశ పూజతో మొదలు పెట్టిన అమీర్ ఖాన్ వరుసగా తంతును పూర్తి చేశాడు. ఈ పూజా కార్యక్రమంలో లాల్ సింగ్ చద్దా డైరెక్టర్ అద్వైత్ చందన్ తో పాటు  తన  ఆఫీసు సిబ్బంది కూడా పాల్గొన్నారు. విశేషం ఏంటీ అంటే..అమీర్ ఖాన్ స్వయంగా ఈ ఫోటోలను నెటిజన్లతో పంచుకున్నారు. అయితే ఈ పూజలోని హారతి కార్యక్రమంలో  కిరణ్ రావు హారతి పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. 

అయితే అమీర్ డిఫరెంట్ గెటప్ కొత్త సినిమా కోసమేనని అంటున్నారు.. ఇటీవల ఆయన నటించగా భారీ అంచనాలతో వచ్చిన లాల్ సింగ్ చద్దా ప్రేక్షకులను నిరాశ పరిచింది. అయితే ఈ సినిమా ప్లాప్ తో అమీర్ ఖాన్ కాస్త గ్యాప్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు. కొంత కాలం  తర్వాత సినిమాను ప్రకటించనున్నారని సమాచారం..

Follow Us:
Download App:
  • android
  • ios