Asianet News TeluguAsianet News Telugu

మనవరాలు వయసున్న హీరోయిన్ తో.. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ డేటింగ్..?

ఫిల్మ్ ఇండస్ట్రీలో డేటింగ్స్.. అగ్రిమెంట్లతో పెళ్లిళ్లు కామన్. ఇష్టమైనప్పుడు  కలుస్తారు.. ఇష్టం లేకపోతే.. విడిపోతారు.. వయస్సుతో సంబంధం లేకుండా  ప్రేమలో మునిగితేలుతుంటారు.. తాజాగా బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కూడా అలాగే చేశాడు.
 

Aamir Khan Dating With Heroine Fatima Sana Shaikh JMS
Author
First Published May 28, 2023, 2:35 PM IST


ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం.. మాయా లోకం. అందులో నవ్వులు, ఏడుపులతో పాటు..  లవ్వులు, డేటింగ్ లు, ఎఫైర్లు, పెళ్లిళ్లు , బ్రేకప్ లు సర్వసాధారణం . వాటి గురించి జనాలు పెద్దగా పట్టించుకోరు . చిత్ర విచిత్రాల అడ్డా సినిమా పరిశ్రమ. అటువంటి ఇండస్ట్రీలో ఏజ్ గ్యాప్ తో జంటగా నటించడం కామన్ గా జరిగేదే. అటువంటి సమాయంలో.. అయితే మనవరాలు వయసున్న హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నారు అంటే అది పట్టించుకోకుండా ఎలా ఉంటారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న న్యూస్ ప్రకారం  బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తా ఎదుగుతున్న ఫాతిమా సనా షేక్ తో హీరో అమీర్ ఖాన్ డేట్ చేస్తున్నారట. బాలీవుడ్ మీడియా ఈ విషయన్ని కోడై కూస్తోంది మరి.

చాలా ఏజ్ గ్యాప్ ఉన్న హీరోయిన్ తో.. హీరో  డేటింట్ అంటే.. అంతా షాక్ అవుతున్నారు. అది కూడా మనవరాలు వయసున్న  హీరోయిన్ ఫాతిమా సనా షేక్  ను ఆయన పెళ్లి చేసుకోబోతున్నారట . వీళ్లిద్దరు కలిసి దంగల్ సినిమాలో కనిపించారు. ఆశ్చర్యం ఏంటంటే ఈ సినిమాలో ఆమె ఆయనకు కూతురుగా  నటించింది .అయితే వీళ్ళ బంధం ఎలా..? ఎప్పుడు..? స్టార్ట్ అయిందో తెలియదు .. కానీ వీళ్ళు డేటింగ్ లో ఉన్నారు అన్న వార్త బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది. 

చాలా కాలంగా అమీర్ ఖాన్ సింగిల్ కానే ఉంటున్నాడు. తన భార్యకు డివర్స్ ఇచ్చేసి బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఫాతీమాతో ప్రేమలో పడ్డ అమీర్.. ఆమెతో కలిసి..  డిన్నర్లు , పబ్బులు , పార్టీలు అంటూ తెగ తిరిగేస్తున్నాడట. బయట ఎవరికంటా పడకుండా.. సైలెంట్ గాతిరిగేస్తున్నారట వీరిద్దరు. దాంతో ఈ విషయం సోషల్ మీడియా చెవిలో పడింది.  అంతే కాదు రీసెంట్ గా సోషల్ మీడియా సెన్సేషన్  ఉమర్ సైంధు చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. 

అమీర్ ఖాన్ తో ఫాతీమా బంధం గురించి ఉమర్ సంధు చాలా లోతుగా..  బోల్డ్ గా రాసుకోచ్చాడు . ఈ విషయంలో అమీర్ స్పందించలేదు. కాని ఫాతీమా మాత్రం గట్టిగానే ఇచ్చేసింది. .నాకు సంబంధం లేని వ్యక్తుల గురించి నేను ఏం మాట్లాడను ..ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు ఇలా లేనిపోని వార్తలు రాయడం సరికాదనిఇచ్చి పడేసింది. అయితే వీరిద్దరి మధ్య క్లోజ్ గా ఉంటున్న ఫిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios