ఇప్పటివరకూ రెండు పెళ్ళిళ్లు చేసుకోవడమే కాకుండా.. రెండు సార్లు విడాకులు కూడా ఇచ్చాడు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్. ఫస్ట్ టైమ్ ఈ విషయం పై స్పందించాడు. ఇంతకీ తాను రెండు సార్లు విడాకులు ఇవ్వడంపై పీకే ఏమంటున్నాడంటే..?
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పీకే, దంగల్ లాంటి సినిమాలు చాలు ఆయన సత్తా ఏంటో చెప్పడానికి. ఇక ఆయన పర్సనల్ లైఫ్ లో కూడా చాలా క్లియర్ గా ఉంటాడు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరు ఉన్న అమీర్ ఖాన్ కు రెండు సార్లు పెళ్లి.. రెండు సార్లు విడాకులు అయిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఎన్ని విమర్షలు వచ్చినా ఎప్పుడూ నొరుపెదపని అమీర్.. తాజాగా తన విడాకులు గురించి మాట్లాడాడు.
అమీర్ రీసెంట్ గా తన రెండో భార్య కిరణ్ రావుతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అంతకు ముందు మొదటి భార్య రీనా దత్తాకు కూడా ఆయన విడాకులు ఇచ్చారు. తన విడాకులపై ఆమిర్ ఖాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు.. తమ విడాకుల గురించి జనాలు అర్థం చేసుకోవడం చాలా కష్టమని అన్నారు.
సాధారణంగా విడాకుల అంటే చాలా మంది కోపంగా విడిపోతారు. ఆ తర్వాత ఆ జంట ఒకరిని మరొకరు పట్టించుకోరు. శత్రువుల్లా మారిపోతారు అని అన్నారు అమీర్. కానీ తాము మాత్రం అలా కాదని, తాము వివాహ వ్యవస్థకి గౌరవం ఇవ్వాలని కోరుకున్నామని చెప్పుకొచ్చారు. దీనిపై ఎన్నో సార్లు చర్చించామని...విడిపోయిన తర్వాత కూడా మంచి ఫ్రెండ్స్‌గా ఉండాలని నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. తనకు తన ఇద్దరు మాజీ భార్యలతో మంచి బంధమే ఉండడం తన అదృష్టమని చెప్పుకొచ్చారు.
తాను, రీనా, కిరణ్, సత్యజీత్ భత్కల్ కలిసి పానీ ఫౌండేషన్‌ను స్థాపించామని అన్నారు. తాము ఇప్పటికీ కూడా ఆ సంస్థకి సంబంధించిన ప్రాజెక్ట్‌లకి కలిసి పని చేస్తున్నామని అన్నారు. తమ పిల్లల విషయంలో కూడా తల్లిదండ్రులుగా తమ బాధ్యతను నిర్వహిస్తున్నామని తెలిపారు.
బయట జరిగే విధంగా తాము గొడవలు పడి విడిపోలేదని.. ఒకరికి ఒకరం పర్సనల్ స్పస్ ఇచ్చుకున్నామంటున్నారు అమీర్ ఖాన్. విడిపోవడం వల్ల తమ మధ్య ఎటువంటి మనస్పర్థలు లేవు అంటున్నాడు స్టార్ హీరో. ప్రస్తుతం అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్ధా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. హీరోగా చేస్తూనే నిర్మాతగా కూడా మారారు అమీర్.
