బాలీవుడ్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం సృష్టించిన ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే కేసు సుశాంత్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ రియా చక్రవర్తి సహా మరికొంత మందిని అరెస్ట్ చేశారు. అయితే  ఈ కేసుతో పాటు బాలీవుడ్‌లోని మాఫియా, నెపోటిజం (వారసత్వం), గ్రూపిజంల మీద కూడా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కరణ్ జోహర్, మహేష్ భట్ లాంటి వారిని టార్గెట్‌ చేస్తూ విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఆమిర్‌ ఖాన్ సోదరుడు ఫైజల్‌ ఖాన్‌ కూడా కరణ్ జోహర్‌ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. కరణతో కూడా అమర్యాదగా ప్రవర్తించాడని బాలీవుడ్‌లో గ్రూపిజం, బంధుప్రీతి చాలా ఎక్కువగా ఉన్నాయని ఆరోపించాడు. ప్రపంచం మొత్తం ఇలాంటి పరిస్థితుల్లోనే ఉందని, బాలీవుడ్‌లో ఈ పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని చెప్పాడు ఫైజల్‌. ఆమిర్‌ 50వ పుట్టిన రోజు సందర్భంగా జరిగిన పార్టీలో కరణ్‌ తనను అవమానించాడని చెప్పడు ఫైజల్‌.

తాను ఆ పార్టీలో ప్రముఖులతో మాట్లాడుతుంటే కరణ్‌ కలుగ  జేసుకున్నాడని, తన గురంచి చాలా అమర్యాధగా మాట్లాడాడని చెప్పాడు. ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్‌ లేకుండా నిలదొక్కుకోవటం అసాధ్యమని కామెంట్ చేశాడు ఫైజల్‌. దీంతో మరోసారి ఇండస్ట్రీలోని నెపోటిజం, గ్రూపిజం మీద చర్చ మొదలైంది. ఇక ఇప్పటికే వీటి మీద బాలీవుడ్‌ నటి కంగన పెద్ద యుద్ధమే చేస్తోంది.