అమీర్‌ ఖాన్‌ ప్రొడక్షన్‌ ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. రిలాక్స్ అవుతూ క్రికెట్‌ ఆడిన అమీర్‌ ఖాన్ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. 

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్ అమీర్‌ ఖాన్‌(Aamir Khan). నటనలో ఆయన ఎంత పర్‌ఫెక్ట్ గా ఉంటాడో తన సినిమాల ద్వారా నిరూపించారు. ఆయన పాత్ర కోసం ఎంతగా శ్రమిస్తాడో `దంగల్‌`, `పీకే` వంటి చిత్రాల్లో నిరూపించారు. అంతేకాదు `లగాన్‌`, `దంగల్‌` చిత్రాలతో తనకు క్రీడలపై ఉన్న అభిరుచిని చాటుకున్నారు. ఇదిలా ఉంటే ఆయన క్రికెట్‌ ఆడటం విశేషం. తన టీమ్‌ మెంబర్స్ తో కలిసి సరదాగా క్రికెట్‌ ఆడాడు అమీర్‌. మంచి షాట్‌ కూడా కొట్టాడు. డిఫెన్స్ లోనూ బాగా ఆడుతున్నారు. ఆడింది రెండు బాల్స్ అయినా మంచి అనుభవం ఉన్న క్రికెటర్‌లా కొట్టడం విశేషం. 

తాజాగా అమీర్‌ ఖాన్‌ ప్రొడక్షన్‌ ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. రిలాక్స్ అవుతూ క్రికెట్‌(Cricket) ఆడిన అమీర్‌ ఖాన్ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇందులో తనకు ఐపీఎల్‌(IPl)లో ఛాన్స్ కావాలని కోరారు అమీర్‌. రెండో షాట్‌ కొట్టాకా..`ఐపీఎల్‌లో ఛాన్స్ ఇస్తారా?` అంటూ కామెంట్‌ చేశారు. తన ఆటతీరుని చూసి ఐపీఎల్‌లో ఆడే అవకాశం ఇవ్వాలని సరదాగా కామెంట్‌ చేశారు అమీర్‌ ఖాన్‌. ఫన్నీగా ఆయన చెప్పిన డైలాగ్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 

View post on Instagram

ఈ సందర్భంగా మరో సర్‌ప్రైజ్‌ లీక్‌ చేశారు అమీర్‌ ఖాన్‌. ఈ నెల 28న డేట్‌ గుర్తు పెట్టుకోవాలని, ఆ రోజు ఓ స్టోరీ చెప్పబోతున్నట్టు తెలిపారు. మరి ఆయన ఏం చెప్పబోతున్నారు? ఆ రోజు ఫ్యాన్స్ కి ఏం సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. అభిమానులు సైతం ఆతృతగా వెయిట్‌ చేస్తున్నామని, సర్‌ప్రైజ్‌ ఏంటో చెప్పండి అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఆ రోజు తన సినిమాకి సంబంధించిన అప్‌డేట్లు ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. 

అమీర్‌ ఖాన్‌ ప్రస్తుతం `లాల్‌ సింగ్‌ చద్దా`(Lal Singh Chaddha) అనే చిత్రంలో నటిస్తున్నారు. `ఫారెస్ట్ గంప్‌` అనే హాలీవుడ్‌ చిత్రానికిది రీమేక్‌. ఇందులో కరీనా కపూర్‌ కథానాయికగా నటిస్తుంది. అద్వైత్‌ చందన్‌ దర్శకుడు. ఈ చిత్రంలో నాగచైతన్య కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయనకిది బాలీవుడ్‌ డెబ్యూ ఫిల్మ్. బలమైన పాత్రలో సైనికుడిగా కనిపించబోతున్నారు చైతూ. ఈ చిత్రం ఆగస్ట్ లో విడుదల కాబోతుంది. అయితే సినిమాకి సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ చేయబోతున్నారు అమీర్‌. అందులో భాగంగా ఈ చిత్రం నుంచి టీజర్‌, ఫస్ట్ గ్లింప్స్ లాంటి ఈ నెల 28న విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. 

మరోవైపు ఆ రోజు కొత్త ప్రాజెక్ట్ ఏదైనా ప్రకటిస్తారా? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. మొత్తానికి ఈ నెల 28న అమీర్‌ తన అభిమానులకు ఏదో సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నారని అర్థమవుతుంది. దీంతో ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. అమీర్‌ చివరగా `థగ్స్ ఆఫ్‌ హిందూస్థాన్‌` చిత్రంలో నటించారు. ఇది పరాజయం చెందింది. నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు సిల్వర్‌ స్క్రీన్‌పై సందడి చేయబోతున్నారు అమీర్‌.