ధగ్స్ ఆఫ్ హిందు స్దానీ డిజాస్టర్ అయిన గ్యాప్ తీసుకున్న అమీర్ ఖాన్ తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. నెట్ ఫ్లిక్స్ ఒరిజనల్ సీరిస్ లో బిజీ అయ్యారు. అయితే నెట్ ఫ్లిక్స్ తో విభేధాలు వచ్చాయని సమాచారం. వారు ఆయన్ను ఇబ్బంది పెడుతున్నారని..మిస్టర్  పర్ఫెక్షనిస్ట్‌  గా వ్యవహించే ఆయన డిమాండ్స్ ని వాళ్లు తీర్చలేక చేతులెత్తేస్తున్నట్లు సమాచారం.

వివరాల్లోకి వెళితే ..నెట్ ఫ్లిక్స్ వారు..ఓషో జీవిత చరిత్రను వెబ్‌ సిరీస్‌ రూపంలో ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం రచయిత శకున్‌ బత్రా స్క్రిప్ట్‌ కూడా సిద్ధం చేసారు. అంకేకాదు మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి కనబరిచారు. అంతేకాదు లాస్‌ ఏంజెల్స్‌ వెళ్లి మరీ చానెల్‌ ప్రతినిధులను కలిసి మాట్లాడి వచ్చారు ఆమిర్‌.  దాంతో మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌ లిస్టులో మరో విలక్షణ పాత్ర చేరుతోందని.. వెబ్‌ సిరీస్‌లో ఆమిర్‌ను చూసి అభిమానులు కూడా కొత్త అనుభూతి పొందవచ్చు అనుకున్నారు. 

అంతవరకూ బాగానే ఉంది. అయితే అమీర్ ఖాన్ ఈ స్క్రిప్టులో చాలా మార్పులు చేసారట. అంతేకాక అలియా భట్ ని ఈ ప్రాజెక్టులోకి తీసుకోవాలని అన్నారట. మా ఆనంద్ షీలా గా ఆమెను చూపాలనుకున్నారు. ఆమె ను ఒప్పించి ప్రాజెక్టులోకి తేలేకపోయారు. అంతేకాక ఆశ్రమం సెట్ అది రియల్ గా అనిపించాలని, కాస్త భారిగానే సినిమా స్ధాయిలో ఉండాలని అమీర్ ఖాన్ ఆలోచన. అయితే నెట్ ఫ్లిక్స్ వాళ్లు అంతంత బడ్జెట్ లు పెట్టాలంటే కాస్త వెనకడుగు వేస్తున్నారట. అమీర్ ఖాన్ వంటి స్టార్ సీన్ లోకి వచ్చినప్పుడు ఆ మాత్రం చూసుకోవద్దా అని బాలీవుడ్ జనం అంటున్నారు. అదీ నిజమే. 

ఇక జీవిత కాలంలో పలు వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న ఓషో 1990లో మరణించారు. వైల్డ్‌ వైల్డ్‌ కంట్రీ పేరుతో ‘ద నెట్‌ఫ్లిక్స్‌’ ఓషో జీవితం ఆధారంగా రూపొందించిన డాక్యుమెంటరీ సిరీస్‌ సూపర్‌ హిట్‌ అయ్యింది. దీంతో బీ- టౌన్‌లో కూడా పలువురు ఈ సిరీస్‌ గురించి చర్చిస్తున్నారు.