ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్‌.రాజమౌళి తనయుడు ఎస్‌ఎస్‌. కార్తికేయ నిర్మాతగా షైనింగ్‌ బిజినెస్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఆకాశవాణి  అనే సినిమాని ఆ మధ్యన మొదలెట్టారు. అయితే ఊహించని విధంగా  ఈ సినిమా నుండి రాజమౌళి కుమారుడు ఎస్ ఎస్ కార్తికేయ తప్పుకున్నట్లు, దర్శక నిర్మాతలతో ఆయనకు ఏర్పడిన అభిప్రాయ భేధాలే కారణమని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఐతే ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ ఎస్ ఎస్ కార్తికేయ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఆ నోట్ లో ఆయన తాను తప్పుకోవటం నిజమే అని చెప్పారు. అందుకు కారణంగా ఆయన ఆకాశవాణి సినిమా దర్శకుడితో వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ అని చెప్పారు.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం స్టోరైలైన్ ఏమిటనేది ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా కథ ...రాజమౌళి సూపర్ హిట్ ఈగ ని పోలి ఉంటుందని వినపడుతోంది. అందులో ఈగ ...పగ తీర్చుకుంటే...ఇక్కడ రేడియో పగ తీర్చుకుంటుందని చెప్తున్నారు. అయితే ఇందులో ఎంతవరకూ నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఆకాశవాణి సినిమాకు అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తుండగా, ఏ. పద్మనాభ రెడ్డి నిర్మిస్తున్నారు.

ఈ  సినిమాకు సంబంధించిన పలు సన్నివేశాలను  మినుములూరు ఏపీఎఫ్‌డీసీకి చెందిన కాఫీ తోటల్లో చిత్రీకరించారు. హీరో హీరోయిన్‌లు లేకుండా కేవలం ఇతర పాత్రలతో 1970 నాటి అంశాలను ప్రధానంగా తీసుకుని, పౌరణిక బాణిలో సినిమా ఉంటుందని యూనిట్‌ సభ్యులు తెలిపారు. దర్శకుడు రాజమౌళి వద్ద అసోసియెట్‌ డైరెక్టర్‌గా పని చేసిన అశ్విన్‌ గంగరాజు తొలిసారిగా ఆకాశవాణి చిత్రానికి దర్వకత్వం వహిస్తున్నారని తెలిపారు. జబర్దస్త్‌ నటుడు శేషు, తదితర కొత్తవారు మాత్రమే ఈ చిత్రంలో నటిస్తున్నారని తెలిపారు.