నవంబర్ 11వ తేదీ రాత్రి 10.30 గంటల నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు మంచి టాకే వచ్చింది. ఓటీటిలలో విడుదలైన సినిమాల్లో ది బెస్ట్ అనిపించుకుంది. ఇక  ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రసారం చేసింది జెమినీ టీవీ.

 ‘ఆకాశం నీ హద్దురా’కి ఏపీ, తెలంగాణ పట్టణ ప్రాంతాల్లో 6.77 రేటింగ్ వచ్చింది. ఒక డబ్బింగ్ చిత్రానికి ఇది మంచి రేటింగ్. కొత్త  సినిమా ప్రీమియర్ అయినప్పుడు కనీసం 10 పాయింట్ల రేటింగ్ అయినా రావాలి. కానీ ఇది డబ్బింగ్ సినిమా కాబట్టి… ఈ రేటింగ్ ని బాగా వచ్చినట్లు గానే పరిగణించాలి అంటోంది టీవి మీడియా.

గుంటూరు జిల్లాలోని చుండూరు గ్రామానికి చెందిన ఒక సాధారణ స్కూల్ మాస్టారు కొడుకు డెక్కన్ ఎయిర్ అనే విమానయాన సంస్థను ఎలా స్థాపించగలిగాడు అనేదే ఈ చిత్ర ప్రధాన కథ. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాకుడు కెప్టెన్ జి.ఆర్. గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా చేసుకుని విమానయాన రంగంలో వచ్చిన మార్పులను వివరిస్తూ కొంత కల్పిత కథను జతచేసి ఈ సినిమాను రూపొందించారు.

మరో ప్రక్క నితిన్, రష్మిక నటించిన ‘భీష్మ’ మొదటిసారి టీవీల్లో ప్రసారం చేసినప్పుడు చాలా తక్కువ రేటింగ్ తెచ్చుకొంది. కానీ జనవరి 10న ప్రసారం చేసినప్పుడు 7.59 రేటింగ్ రాబట్టుకొంది. ఫస్ట్ టైం కన్నా రెండో సారే మంచి రేటింగ్ వచ్చింది.