Asianet News TeluguAsianet News Telugu

#Rashmika: రష్మిక ని టార్గెట్ చేస్తూ మాజీ మంత్రి ట్వీట్, వైరల్

 మాజీ మంత్రి ..రష్మిక  పేరు ప్రస్తావించకుండానే డైరక్ట్ ఎటాక్ చేసారు. ఒక నటి అకస్మాత్తుగా  ప్రస్తుత పాలనలో అటల్ ..

Aaditya Thackeray Take Dig At Rashmika Mandanna? jsp
Author
First Published May 18, 2024, 9:11 AM IST

రాజకీయాలు, సినిమా నటులు అనుబంధం ఇప్పటిది కాకపోయినా..అందులోకి వెళ్తే మాత్రం తిట్లు ,విమర్శలు ఎంతటివారికైనా తప్పవు. తాజాగా అలాంటి అనుభవాన్నే రష్మిక చవి చూస్తోంది. తాను చేసిన ఓ ట్వీట్ పై  ప్రధాని మోడి స్పందించారని ఆనందపడేలోగా ఆమెను టార్గెట్ చేస్తూ విమర్శలతో కూడిన పోస్ట్ లు, ట్వీట్స్ మొదలైపోయాయి. 

దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెన ``ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్``ను (MTHL) వాణిజ్య రాజధాని ముంబైలో (Mumbai) నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ వంతెనను ``అటల్ సేతు`` (Atal Setu) అని పిలుస్తున్నారు. ఈ అటుల్ సేతుపై ఇటీవల ప్రయాణించిన ప్రముఖ హీరోయిన్ రష్మికా మందన్న (Rashmika Mandanna) ప్రశంసలు కురిపించింది. అటల్ సేతుపై కారులో ప్రయాణిస్తూ దాని గురించి తాను మాట్లాడుతున్న వీడియోను రష్మిక ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 
ఆ వైరల్ వీడియోను తాజాగా ప్రధాని మోదీ (PM Modi) వీక్షించారు. ``ప్రజల జీవితాలను మెరుగుపరచడం, వారిని అనుసంధానించడం కంటే మించి సంతృప్తి ఏముంటుంద``ని ప్రధాని ట్విటర్‌లో కామెంట్ చేశారు. భారత్.. ఇలాంటి ఓ అద్భుతాన్ని ఆవిష్కరిస్తుందని బహుశా ఎవరూ ఊహించి ఉండరని, అసాధ్యం అనుకున్న దాన్ని ఏడేళ్ల వ్యవధిలో సుసాధ్యం చేశారని రష్మిక ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. ఈ వంతెనపై ప్రయాణం ఓ మధురానుభూతిని ఇస్తుందని, వికసిత్ భారత్‌కు ఈ బ్రిడ్జి అద్దం పడుతోందని వ్యాఖ్యానించింది. అయితే ఆ వీడియో బీజేపీ ప్రమోషన్ లాగ ఉందని విమర్శలు మొదలయ్యాయి.

తాజాగా  ఉద్ధవ్ థాక్రే కుమారుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య థాక్రే  ఆమె పేరు ప్రస్తావించకుండానే డైరక్ట్ ఎటాక్ చేసారు. ఒక నటి అకస్మాత్తుగా  ప్రస్తుత పాలనలో అటల్ సేతుగా బ్రాండ్ చేయబడిన   MTHL పై  ఒక ప్రకటన (అది పెయిడో కాదో మరి ) చేయడం నేను చూశాను. దానికి సంభందించిన కొన్ని వాస్తవాలు అంటూ కొన్ని అంశాలు హైలెట్ చేస్తూ ట్వీట్ చేసారు. 
 
అలాగే  ఆమె  చివర్లో మేల్కొని అభివృద్ధికి ఓటు వేయండి చెప్పింది, - అదే కరెక్ట్, ఎందుకంటే దానర్దం బిజెపికి ఓటు వేయవద్దు అని చెప్పుకొచ్చారు. 
 
 ఇక రష్మిక కెరీర్ పరంగా ఆ మధ్యన కొద్దిగా వెనకబడినట్లు అనిపించింది కానీ యానిమల్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చేసింది. కమర్షియల్ హీరోయిన్‌గా ఫుల్‌ బిజీగా ఉన్న ఈ బ్యూటీ, ఇప్పుడు నటిగా గుర్తింపు తెచ్చుకునే పనిలో ఉంది.  నార్త్‌లో , సౌత్‌ తేడా లేకుండా కుమ్మి పడేస్తున్న ఈ నేషనల్‌ క్రష్ రష్మిక హీరోయిన్‌గా నాలుగు సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఆమె కాన్సర్టేషన్ మొత్తం వాటిపైనే ఉంది.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios