కృతీసనన్ కు ఓం రౌత్ హగ్గులు, ముద్దులు, తిరుమలలో ఏంటీపనులంటూ విమర్శలు
ఆదిపురుష్ సినిమా డైరెక్టర్ ఓం రౌత్ చేసని పనికి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. తిరుమలలో ఆయన చేసిన పనికి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభాస్, కృతి సనన్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. ఓం రౌత్ డైరెక్ట్ చేసిన ఈసినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న( జూన్ 06) తిరుపతిలో ఘనంగా జరిగింది. అయితే నిన్న ఉదయాన్నే తిరుమల శ్రీవారిని దర్శిచుకున్నారు ఆదిపురుష్ టీమ్. అయితే ఈ టీమ్ లో కృతీ సనన్ మిస్ అయ్యింది. ఇక ఈ ఈవెంట్ కంప్లీట్ అవ్వగానే ఆరోజు రాత్రి తిరుమలలో బసచేసిన హీరోయిన్ కృతీ సనన్ మరుసటి రోజు ఉదయాన్నే శ్రీవారిదర్శనం చేసుకుంది. కృతీతో పాటు.. డైరెక్టర్ ఓం రౌత్ ఇతర టీమ్ కొంత మంది కూడా దర్శనంలో పాల్గోన్నారు.
అయితే ఈ దర్శనం తరువాత ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ చేసిన పని ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. ఈ ఉదయం తిరుమల శ్రీవారిని వీరు దర్శించుకున్నారు. అనంతరం గుడి వెలుపల కృతి సనన్ కు సెండాఫ్ ఇచ్చాడు ఓం రౌత్. అయితే ఈక్రమంలో ముద్దుపెట్టుకుని, హత్తుకున్నారు. ఆ తర్వాత కృతి కారెక్కి వెళ్లిపోయారు. అలా తిరుమలలో.. శ్రీవారి ఆశీర్వాదం చేసిన శేష వస్త్రాలు అలా వంటిపై ఉండగానే ఆముద్దులు హగ్గులు కనిపించడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంతే కాదు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు కూడా ఓం రౌత్ పై మండిపడుతున్నారు. తిరుమలలో..దేవుడి సన్నిదిలో ఈ గలీజ్ పనులేంటంటూ..మండిపడుతున్నారు. పరిత్రమైన స్థలంలో ఈ పనేంటని వారు ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు ఈ వివాదం పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది. ఈ విషయంలో బీజేపీ నేతలు కూడా ఘాటుగా స్పందించారు... తిరుమల ఒక ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమని, ఇది పిక్నిక్ స్పాట్, షూటింగ్ స్పాట్ కాదని వారికి వార్నింగ్ ఇచ్చారు. స్వామివారి అర్చన సేవలో పాల్గొని ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆలయ మహాద్వారం ముందు ఇలాంటి పని చేయడాన్ని తాము ఖండిస్తున్నామని చెప్పారు.
అంతే కాదు ఇలాంటి పని చేసినందకు ఓం రౌత్ తో పాటు కృతీసన్ కూడా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మీ కల్చర్ ఏదైనా కావచ్చు.. కాని దేవుడి సన్నిధిలో మాత్రం ఇది ఎంత మాత్రం సరికాదని అన్నారు. మరోవైపు ఈ విషయంలో ఆదిపురుష్ టీమ్ వాదన వేరే విధంగా ఉంది. కృతి సనన్ కు ఫ్లైట్ టైమ్ అవుతోందని, ఆమె హడావుడిగా బయల్దేరేందుకు రెడీ అవ్వడంతో.. ఆమెకు సెండాఫ్ ఇచ్చే క్రమంలో డైరెక్టర్ ఇలా చేశారని.. కాని ఇందులో తప్పుడు ఉద్దేశ్యం కాని..అసభ్యత కానీ లేదని అంటున్నారు.