రీమేక్ మూవీలో బావతో కలసి నటిస్తున్న సమంత...

Aadi Pinisetty and Samantha for U Turn Remake
Highlights

రీమేక్ మూవీలో బావతో కలసి నటిస్తున్న సమంత

రంగస్థలంలో రామలక్ష్మిగా అలరించిన టాలీవుడ్ బ్యూటీ సమంత.. నటిగా మరెన్నో మెట్లు ఎక్కేసింది. మరెవరికీ సాధ్యం కాదని అనిపించే రీతిలో తన నటనతో మెప్పించేసింది. గ్లామర్ డాల్ గానే కాదు.. డీగ్లామర్ రోల్ లో కూడా తాను మురిపించగలనని ప్రూవ్ చేసింది చిట్టిబాబు లవర్ రామలక్ష్మి. సమంత చేస్తున్న మరుసటి చిత్రం యూ-టర్న్.

కన్నడలో బ్లాక్  బస్టర్ గా నిలిచిన ఈ మూవీని తెలుగు అండ్ తమిళ్ రీమేక్ లో నటింస్తోంది సమంత. ఓ ఫ్లై ఓవర్ పై జరిగిన యాక్సిడెంట్ ను ఛేదించే వ్యక్తిగా నటిస్తోంది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆది పినిశెట్టి నటిస్తుండడం విశేషం. ఇప్పటికే రంగస్థలం మూవీలో వీరిద్దరూ కలిసి నటించారు. అందులో సమంతకు బావ వరుస రోల్ లో నటించిన ఆది.. ఈ సినిమాలో పోలీస్ గా నటించి మెప్పించబోతున్నాడు. యూటర్న్ మూవీకి సమంత-ఆది హిట్టు కాంబో అనే అంశం కూడా ఇప్పుడు ప్లస్ పాయింట్ అవుతోంది.

కన్నడ మూవీని డైరెక్ట్ చేసిన పవన్ కుమార్.. తెలుగు-తమిళ్ యూటర్న్ ను కూడా రూపొందిస్తున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకోగా.. ఇప్పుడు రెండో షెడ్యూల్ కు రంగం సిద్ధమవుతోంది. రాహుల్ రవీంద్రన్.. భూమికలు కూడా ఈ చిత్రంలో నటించబోతున్నారు. 

loader