ఇటీవల ఎంగేజ్‌మెంట్ చేసుకున్న నటుడు ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రానీ త్వరలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. వీరి వెడ్డింగ్ డేట్ ఫిక్స్ అయ్యింది.
స్టార్ ఇమేజ్ అనే ట్రాప్‌లో పడకుండా నటుడిగా తనని తాను ఆవిష్కరించుకుంటూ రాణిస్తున్నారు ఆదిపినిశెట్టి(Aadhi Pinishetty). హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ నటిస్తూ తన ప్రత్యేకతని చాటుకుంటున్నారు. మొత్తంగా విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకుంటున్నారు. నటుడిగా బిజీగా ఉన్న ఆదిపినిశెట్టి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇటీవల ప్రియురాలు, నటి నిక్కీ గల్రానీ(Nikki Galrani)తో ఎంగేజ్ మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. మార్చి 24న ఈ ఇద్దరు నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలో మూడుముళ్లతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా వీరి మ్యారేజ్‌కి ముహూర్తం ఫిక్స్(Aadhi Pinishetty Nikki Galrani Wedding) అయినట్టు తెలుస్తుంది. మే 18న గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. చెన్నైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో ఆదిపినిశెట్టి, నిక్కీ గల్రానీ వివాహం చేసుకోబోతోన్నారు. ఎంగేజ్‌మెంట్ చాలా సింపుల్‌గా చేసుకున్నారు. అతికొత్త మంది ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో జరిగింది. దీంతో వెడ్డింగ్ మాత్రం గ్రాండియర్‌గా ప్లాన్ చేశారట.
తెలుగు, తమిళంలో నటుడిగా రాణిస్తున్న ఆదిపినిశెట్టి, నిక్కీ గల్రానీ కలిసి `యాగవరైనమ్ నా కక్కా` చిత్రంలో నటించారు. ఇది తెలుగులో `మలుపు`గా విడుదలై ఆకట్టుకుంది. విమర్శకుల ప్రశంసలందుకుంది. ఆ సినిమా టైమ్ లో వీరిద్దరు ప్రేమలో పడ్డారట. ఎట్టకేలకు ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్తున్నారు. దీంతోపాటు ఈ ఇద్దరు `మరగద నానయం` అనే చిత్రంలోనూ కలిసి నటించారు. ప్రస్తుతం ఆదిపినిశెట్టి `ది వారియర్` చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు. రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళంలో రూపొందుతుంది. ఇటీవల ఆదిపినిశెట్టి `క్లాప్`, `గుడ్‌లక్ సఖీ` చిత్రాలతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
