టచ్ చేసి చూడు - నేల టిక్కెట్టు సినిమాల తరువాత మాస్ రాజా రవితేజ నుంచి వస్తోన్న చిత్రం అమర్ అక్బర్ ఆంటోని. గతంలో ఎప్పుడు లేని విధంగా రవితేజ మూడు విభిన్నమైన పాత్రల్లో నటించడంతో సినిమాకు బజ్ ని క్రియేట్ చేసింది. ఇక ఈ నెల 16న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న AAA సినిమా సెన్సార్ వర్క్ ను పూర్తి చేసుకుంది. 

శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ స్టైలిష్ ఎంటర్టైనర్ కు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ను జారీ చేసింది. యాక్షన్ సన్నివేశాలు కూడా సినిమాలో ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. ఇక శ్రీను వైట్ల మార్క్ కామెడీ సినిమాలో మరో స్పెషల్ ఎట్రాక్షన్ అని టాక్ వస్తోంది. ఇప్పటికే ఫైనల్ అవుట్ ఫుట్ చూసిన కొందరు సినీ ప్రముఖులు AAA సినిమా దర్శకుడికి హీరోకు మంచి బూస్ట్ ఇస్తుందని తెలిపారు. 

రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ పై అయితే భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. సినిమా విడుదలయ్యే వరకు రిజల్ట్ గురించి చెప్పలేము. మరి ఈ సారి శ్రీను వైట్ల ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు అందుకుంటాడో చూడాలి. చాలా రోజుల తరువాత ఇలియానా తెలుగు ప్రేక్షకులను సరికొత్తగా తన చబ్బీ అందాలతో అలరించడానికి సిద్ధమైంది. మరి ఆమెను ఆడియెన్స్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి.