టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు తాజాగా నటించిన చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ప్రస్తుతం ఈ మూవీ రిలీజ్ కు సిద్ధమైంది. తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ ను లాక్ చేస్తూ అనౌన్స్ మెంట్ ఇచ్చారు.  

టాలెంటెడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో సుధీర్ బాబు (Sudheer Babu) వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. చివరిగా ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. విభిన్న పాత్రల్లో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న సుధీర్ బాబు.. తాజాగా మరో సరికొత్త కథాంశంతో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ (Aa Ammayi Gurinchi Meeku Cheppali) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్లు, టీచర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ క్రేజీ అప్డేట్ ను అందించారు. 

లేటెస్ట్ అప్డేట్ చిత్రం రిలీజ్ డేట్ పై అందింది. వచ్చే నెల సెప్టెంబర్ 16న మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. బ్యూటీఫుల్ లవ్ స్టోరీతో పాటు.. ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ ను చూపించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. త్వరలో చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందనున్నాయి. రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ యూనిట్ వదిలిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. రెడ్ ప్రాక్ లో యంగ్ అండ్ గ్లామర్ బ్యూటీ కృతి శెట్టి (Krithi Shetty)తో సుధీర్ బాబు ఓ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. సుధీర్ ఈ చిత్రంలో కాస్తా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

అయితే చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ విషయంలో కాస్తా జాగ్రత్త పడిందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే రిలీజ్ కు సిద్ధంగా ఉన్న చిత్రాన్ని ఈ నెలలోనే రిలీజ్ చేయాలని యోచించారు. కానీ ఈ నెలలోనే ‘ఏజెంట్’, ‘లైగర్’, ‘కోబ్రా’, ‘మాచెర్ల నియోజకవర్గం’ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ పోటీని తట్టుకోని సుధీర్ నిలబటమే కష్టమనే భావనతో వచ్చే నెలలో విడుదల తేదీని లాక్ చేశారు. ఆరోగ్యకరమైన ప్రదర్శన కోసం సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి మోహన క్రిష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్ క్రితి శెట్టి నటిస్తోంది. బెంచ్ మార్క్ స్టూడెయోస్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. 

View post on Instagram