Asianet News TeluguAsianet News Telugu

అజిత్ ఇంటి ముందు మహిళ ఆత్మహత్యాయత్నం!

తన చావుకి కారణం అజితే అంటూ కేకలు వేసి ఒంటిపై పెట్రోల్ వేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అజిత్ ఇంటికి చేరుకొని సదరు మహిళ ఒంటిపై నీళ్లుపోసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

A woman tried to set herself on fire in front of Thala Ajiths house recently
Author
Chennai, First Published Oct 19, 2021, 12:35 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp


తమళం లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న అజిత్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయనకు తెలుగులో మంచి మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న ‘వాలిమై’ షూటింగ్ ను ఇటీవల హైదరాబాద్ లోనే షూట్ చేసారు. వివాదాలకు దూరంగా ఉండే అజిత్ కు ఇంటా,బయిటా శతృవులు లేరనే చెప్పాలి. ఖాళీ సమయాన్ని తన కుటుంబంతో గడపడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి అజిత్ వల్ల తను ఇబ్బంది పడ్డానని ఓ మహిళ ఏకంగా అజిత్ ఇంటి ముందే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించటం తమిళనాట సంచలనంగా మారింది.

 అజిత్ ని కలవడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా కుదరలేదని.. తన చావుకి కారణం అజితే అంటూ కేకలు వేసి ఒంటిపై పెట్రోల్ వేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అజిత్ ఇంటికి చేరుకొని సదరు మహిళ ఒంటిపై నీళ్లుపోసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

Also read హీరోలను ప్రశ్నించనివారు, నా దుస్తులపై వ్యాఖ్యలా.... కోటపై అనసూయ నిప్పులు

 అందుతున్న సమాచారం ప్రకారం.. ఫర్జానా అనే మహిళ ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో నర్సుగా పని చేస్తుండేది. గతేడాది కరోనా సమయంలో అజిత్, షాలిని కలిసి అదే హాస్పిటల్ కు వెళ్లారు. దీంతో ఫర్జానా అజిత్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అప్పట్లో ఆ వీడియో వైరల్ అయింది. అజిత్ కరోనా బారిన పడ్డాడంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే హాస్పిటల్ రూల్స్ కి వ్యతిరేకంగా ఫర్జానా ప్రవర్తించిందని.. ఆమెని ఉద్యోగంలో నుంచి తీసేశారు. అయితే అజిత్ హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడితే తన ఉద్యోగం తిరిగి వస్తుందనే ఆశతో ఆమె పలుమార్లు అజిత్ ను కలవడానికి ప్రయత్నించింది. కానీ అవకాశం రాలేదు. 

Also read ప్రభాస్ బర్త్ డే సీడీపీ... ఇండియా లెవెల్ లో ట్రెండ్ చేస్తున్న ఫ్యాన్స్!

ఈ నేపథ్యంలో తనకు న్యాయం చేయాలంటూ అజిత్ ఇంటి ముందు ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆమె ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకొని.. కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. ఆమెపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని సమాచారం. 

ఇక అజిత్ తాజా చిత్రం విషయానికి వస్తే...

తలా అజిత్ కుమార్ నటిస్తున్న చిత్రం ‘వాలిమై’. ‘వాలిమై’ పోలీస్ యాక్షన్ డ్రామా. హెచ్ వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హుమా ఖురేషి, కార్తికేయ గుమ్మకొండ, యోగి బాబు, సుమిత్రా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని బోనీ కపూర్ తన సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్నారు.  తెలుగు నటుడు కార్తికేయ విలన్ గా నటిస్తున్నారు. కాగా,  ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి అజిత్‌ ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ విడుదలైంది. ఇందులో అజిత్‌ సీబీ సీఐడి అధికారిగా కనిపించనున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ‘వాలిమై’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటోంది. అజిత్‌కు జోడీగా హ్యుమా ఖురేషి నటిస్తుండగా, యువన్‌ శంకర్‌రాజా స్వరాలు సమకూరుస్తున్నారు. బేవ్యూ ప్రొజెక్ట్స్‌ పతాకంపై బోనీకపూర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios