మెగా స్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రం రెండు రోజుల్లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఆదిత్య మ్యూజిక్ సంస్థ మెగా ఫ్యాన్స్ కోసం అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది.
చిరంజీవి-చరణ్ (Ram Charan)ల మల్టీస్టారర్ ఆచార్య విడుదలకు మరో రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో చిత్రం యూనిట్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 23న హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో ప్రీరిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. రాజమౌళి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే హీరోలతో పాటు దర్శకుడు కొరటాల శివ ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.
సినిమాను మరింత రీచ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తోంది. మరోవైపు ఈ చిత్రం నుంచి క్రేజీ అప్డేట్స్ అందిస్తూ మెగా ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు మేకర్స్. అయితే ఈ చిత్ర మ్యూజిక్ రైట్స్ ను ఆదిత్య మ్యూజిక్ సంస్థ దక్కించుకుంది. తాజాగా మెగా అభిమానుల కోసం ఆచార్య (Acharya) నుంచి రామ్ చరణ్, పూజా హెగ్దేల రొమాంటిక్ సాంగ్ నీలంబరి (Neelambari) ఫుల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేసింది. గతంలో ప్రొమోను విడుదల చేయగా.. తాజాగా ఎడిటెడ్ వెర్షన్ వీడియోను వదిలారు. ప్రస్తుతం ఈ సాంగ్ య్యూటూబ్ లో దూసుకుపోతోంది.
ఆచార్యలో అన్ని సాంగ్స్ అద్భుతంగా ఉన్నాయి. మెగా అభిమానులు మెచ్చేలా ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ఒక్కో సాంగ్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. సంగీత ప్రియులను సినిమాకు దగ్గర చేస్తోంది. అయితే ఈ సినిమాలో ఇంటర్వెల్ సీన్ లో అదిరిపోయే మ్యూజిక్ ట్రాక్ ఉండనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ‘భలే భలే బంజరా’, ‘సానా కష్టం’ సాంగ్స్ దుమ్ములేపుతుండగా.. నీలంబరి వీడియో సాంగ్ మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది.
దేవాలయ భూకబ్జాదారులకు వ్యతిరేకంగా సాయుధం పోరాటం చేసే రెబల్స్ పాత్రల్లో తండ్రీకొడుకులు కనిపించనున్నారు. చిరంజీవి (Chiranjeevi)కి జంటగా హీరోయిన్ కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ కు జోడీగా గ్లామర్ బ్యూటీ పూజా హెగ్దే (Pooja Hegde) నటించింది. దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మాట్నీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఏప్రిల్ 29న చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.

