యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్ 30, ఎన్టీఆర్ 31 సినిమాలపై ఫోకస్ పెట్టారు. ఆయన బర్త్ డే సందర్భంగా ఈ చిత్రాల నుంచి అభిమానులకు అదిరిపోయే ట్రీట్ అందనున్నట్టు తెలుస్తోంది.
టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ‘ఆర్ఆర్ఆర్’తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ చిత్రం తర్వాత తారక్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఊహించని స్థాయికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన తదుపరి చిత్రాలపైనా అభిమానుల్లో అదే స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఎప్పుడెప్పుడు ఈ చిత్రాల నుంచి అప్డేట్స్ వస్తాయని ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ కూడా తదుపరి చిత్రాలను శరవేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
కాగా, ‘ఆర్ఆర్ఆర్’తో భారీ సక్సెస్ ను అందుకున్న తర్వాత కొరటాల శివ, ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఎన్టీఆర్ 30, ఎన్టీఆర్ 31 చిత్రాల్లో నటిస్తున్నాడు తారక్. అయితే మే20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి బిగ్ అప్డేట్స్ రానున్నట్టు గతకొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ రెండు ప్రాజెక్ట్‌ల మేకర్స్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20 లేదా ఒక రోజు ముందుగానే మే 19న అభిమానుల కోసం అదిరిపోయే ట్రీట్ అందించనున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే ఎన్టీఆర్ 30, ఎన్టీఆర్31ల కు సంబంధించిన ఫొటోషూట్ ను కూడా ఎన్టీఆర్ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా తారక్ బర్త్ డే సందర్భంగా NTR30 నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది. అదే విధంగా NTR31 నుంచి ఓ క్రేజీ పోస్టర్ విడుదల కానుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరో రెండు రోజుల్లో తమ అభిమాన హీరో అప్ కమింగ్ ఫిల్మ్స్ నుంచి అప్డేట్స్ వస్తున్నందున ఖుషీ అవుతున్నారు.
ఇక ఎన్టీఆర్ 30ని దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)తో తెరకెక్కించిన చిత్రం ‘ఆచార్య’ కాస్తా మిశ్రమ స్పందను పొందింది. దీంతో ఎన్టీఆర్ 30పై పలువురు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమైన గతంలోనే కొరటాల శివ స్పందిస్తూ.. ఎన్టీఆర్ 30కి సిద్ధం చేసిన కథ చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. ఆ సినిమా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అంచనాలను తప్పదని హామీనిచ్చారు. ఇక ఈ సినిమాలో తొలుత బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ను హీరోయిన్ గా ఎంపిక చేసినా.. తరువాత రష్మికా మందన్న పేరు వినిపిస్తోంది. మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ రవిచంద్ర కన్ఫమ్ అయ్యారని టాక్.
