#Devara: ఎన్టీఆర్ కోసం ఏకంగా బీచ్ నే హైదరాబాద్ కు తెచ్చేసారే
ఆర్ఆర్ఆర్ సహా ఎన్నో ప్రతిష్ఠాత్మక సినిమాలకు పనిచేసిన సిరిల్.. సహజత్వం ఉట్టిపడేలా నగరంలో బీచ్ సెట్ వేసారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రి,కొడుకులుగా కనపడనున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ #NTR, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘దేవర’.RRR తర్వాత దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తీసుకుని ఎన్టీఆర్ మళ్లీ షూటింగ్ చేస్తోన్న సినిమా ఈ ‘దేవర’. సముద్రపు మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ఉండనుంది. ఇందుకోసం హైదరాబాద్ శంషాబాద్ దగ్గరలో భారీ బీచ్ సెట్ ని వేసి షూట్ చేస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ అద్బుతంగా నిజమైన బీచ్ ని తలదన్నేలా ఈ సెట్ ని డిజైన్ చేసినట్లు సమాచారం. ఈ సెట్ కోసం వాడే ఇసుక కర్ణాటక రాష్ట్రం నుంచి తెప్పించినట్లు తెలుస్తోంది. అలాగే అవసరమైన కొన్ని బండరాళ్లును- పెద్ద రాళ్లను కూడా వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చారని తెలుస్తోంది. బీచ్ వెనక వచ్చే కనపడే సముద్రాన్ని విఎఫ్ ఎక్స్ లో బ్లూ మ్యాట్ వినియోగించి తీసిన షాట్స్ తో చూపబోతున్నట్లు సమాచారం. ఈ సెట్ లో కొన్ని యాక్షన్ సన్నివేశాల తో పాటు ఎమోషనల్ సన్నివేశాలు షూట్ చేస్తున్నట్లు సమాచారం.
ఆ సీన్స్ లో తారక్ నటన విశ్వరూపంలా ఉంటుందని చూసిన వారు చెబుతున్నారు. మునుపెన్నడు చూడని కొత్త తారక్ ఆయా సీన్స్ లో కనిపిస్తాడని చెప్తున్నారు. బీచ్ సీన్స్ సినిమాలో హైలెట్ అని తెలుస్తోంది. మొదట కీలక సన్నివేశాల కోసం గోవా, విశాఖపట్నంలో షూట్ చేయాలని భావించారు. అయితే చివరి నిముషం లో మనసు మార్చుకున్న దర్శకుడు ప్రతి సారీ విశాఖ, గోవాలకు వెళ్లే పని లేకుండా హైదరాబాద్ లోనే బీచ్ సెట్ వేయాలని డిసైడ్ అయ్యారట. అలా ఏర్పాటు అయ్యిందే ఈ బీచ్ సెట్. ఆర్ఆర్ఆర్ సహా ఎన్నో ప్రతిష్ఠాత్మక సినిమాలకు పనిచేసిన సిరిల్.. సహజత్వం ఉట్టిపడేలా నగరంలో బీచ్ సెట్ వేసారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రి,కొడుకులుగా కనపడనున్నారు. అయితే రెండు పాత్రలు తెరపై ఒకే సారి కనిపిస్తాయో లేదో చూడాల్సి ఉంది.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో భారీ యాక్షన్ సీన్స్ ఉంటాయని మేకర్స్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఈ చిత్రం ఫైట్ సీక్వెన్స్ లు షూట్ చేస్తున్నారు. అయితే అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సీన్స్ షూట్ పూర్తి కాలేదట. ఆ ఫైట్ సీక్వెన్స్ పనిలోనే టీమ్ తల మునకలుగా బిజీగా ఉంది. అయితే షెడ్యూల్ ప్రకారం జాహ్నవి కపూర్ #JanhviKapoor ఈ షెడ్యూల్ లో పాల్గొనాల్సి ఉంది. కానీ గ్యాప్ లేకపోవటంతో లాస్ట్ మినిట్ లో ఆమెను రిక్వెస్ట్ చేసి ఆమె షూట్ ని రీషెడ్యూల్ చేసినట్లు సమాచారం. అక్టోబర్ మూడవ వారంలో జాహ్నవి ,ఎన్టీఆర్ కాంబో సీన్స్ షూట్ ఉంటుందని సమాచారం.
ఇక ఈ చిత్రానికి అనిరుద్, రత్నవేలు, శ్రీకర్ ప్రసాద్ వంటి టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. వీరితో పాటు హాలీవుడ్ టెక్నిషియన్స్ సైతం యాక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ చేస్తున్నారు.అలాగే ‘దేవర’ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ చేస్తున్నారు. అందులో ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే తండ్రి పేరే ‘దేవర’ అని టాక్. తారక్ పవర్ కు తగ్గట్టుగా ఆయన పాత్ర ఉంటుందని ఫస్ట్ లుక్ చూడగానే అర్థమవుతోంది. ఐదు భాషల్లో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను 2024 ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నారు.