కింగ్ నాగార్జున నేడు తన 61వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. దీనితో టాలీవుడ్ ప్రముఖులు మరియు ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో హ్యాపీ బర్త్ డే కింగ్ నాగార్జున యాష్ ట్యాగ్ భారీగా ట్రెండ్ అవుతుంది. ఇక నాగార్జున తన పుట్టిన రోజు సంధర్భంగా అభిమానులకు ఓ స్పెషల్ గిఫ్ట్ తో వచ్చారు. ఆయన లేటెస్ట్ మూవీ వైల్డ్ డాగ్ నుండి ఇంట్రెస్టింగ్ పోస్టర్ విడుదల చేశారు. ఓ సీరియస్ ఆపరేషన్ లో శత్రువులపై దాడిచేస్తున్న నాగ్ లుక్ ఆసక్తి రేపుతుంది. 

ఇక పోస్టర్ లో సినిమాకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. వైల్డ్ డాగ్ మూవీలో నాగార్జున ఎన్ ఐ ఏ ఆఫీసర్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ వర్మగా ఆయన పాత్ర ఉండనుంది. దేశ భద్రతకు ముప్పుగా ఉన్న అసాంఘిక శక్తులను మట్టుబెట్టే స్ట్రిక్ట్ అండ్ సీరియస్ ఆఫీసర్ గా నాగార్జున కనిపించనున్నారు. ఆయన 12 రిస్కీ ఆపరేషన్స్ లో పాల్గొన్నట్లు చెప్పడం విశేషం. 

ఒక అమ్మాయితో కూడిన ఐదుగురు నైపుణ్యం, సామర్ధ్యాలు కలిగిన ఫీల్డ్ ఏజెంట్స్ విజయ్ వర్మ టీమ్ సభ్యులుగా ఉన్నట్లు పోస్టర్లో రివీల్ చేశారు. మొత్తంగా పోస్టర్ తోనే మూవీపై మంచి అంచనాలు కలిగేలా చేశారు. అహిషోర్ సాల్మన్ వైల్డ్ డాగ్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాతలు అన్వేష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయ్యింది.