Asianet News TeluguAsianet News Telugu

మరో వివాదంలో ఏ ఆర్ రెహమాన్, బయటికొస్తున్న పాత కాంట్రవర్సీలు

ఈ మధ్య వివాదాల మధ్య నలిగిపోతున్నాడు స్టార్ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్  ఏఆర్ రెహమాన్. తాజాగా జరిగిన సంఘటనలు మాత్రమే కాదు.. అంతకు ముందువి కూడా ప్రస్తుతం బయట పడుతున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..? 

A R Rahman Controversy For Live concert on 2018 JMS
Author
First Published Sep 30, 2023, 3:07 PM IST

ఈ మధ్య వివాదాల మధ్య నలిగిపోతున్నాడు స్టార్ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్  ఏఆర్ రెహమాన్. తాజాగా జరిగిన సంఘటనలు మాత్రమే కాదు.. అంతకు ముందువి కూడా ప్రస్తుతం బయట పడుతున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..? 

ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు, ఆస్కార్‌ విజేత ఏ.ఆర్‌.రెహమాన్‌ ఎందుకో ఆ మధ్య వివాదాల్లో బాగా చిక్కుకుంటున్నారు. వరుస వివాదాలు ఆయన్ను వెంటాడుతున్నాయి. ఎక్కువగా మాట్లాడటు రెహమాన్ అయినా సరే ఆయన్ను కాంట్రవర్సీలు వదలడంలేదు.ఇంతకు ముందు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కొంత మంది వ్యాఖ్యల వల్ల వివాదాలు వచ్చాయి. ఇక తాజాగా ఈసారి రెహమాన్ వల్ల కొన్ని వివాదాలు బయట పడుతున్నాయి. 

ఈమధ్య  కొన్ని రోజుల క్రితం చెన్నైలో ఆయన నిర్వహించిన సంగీత కచేరి రసాభాసగా మారిన విషయం తెలిసిందే. నిర్వహణ వైఫల్యం కారణంగా అర్థాంతరంగా మ్యూజిక్‌ కాన్సర్ట్‌ను ముగించడం విమర్శలకు దారి తీసింది. తాజాగా రెహమాన్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. 2018లో ఓ మ్యూజిక్‌ కాన్సర్ట్‌ కోసం రెహమాన్‌ డబ్బులు తీసుకొని తిరిగి చెల్లించలేదని చెన్నై సర్జన్స్‌ అసోసియేషన్‌ పోలీస్‌ కమీషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం అందుతోంది. 

ఒక్కరోజు మ్యూజిక్‌ కాన్సర్ట్‌ కోసం రెహమాన్‌కు 25లక్షలు చెల్లించామంటున్నారు నిర్వాహకులు. అయితే అప్పుడు కాన్సర్ట్ జరిగిందా లేదా అనేది తెలియాల్సిఉంది. అయితే రెహమాన్ ఎలాంటి  అక్రమాలకు పాల్పడలేదని..  ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని, రెహహన్‌ ప్రతీ విషయంలో ఒప్పందం ప్రకారమే నడుచుకుంటాడని ఆయన మేనేజర్‌ సెంథిల్‌ వేలన్‌ తెలిపారు. మరి ఈ వివాదం ఎంత వరకూ వెళ్తుందో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios