Asianet News TeluguAsianet News Telugu

అల్లు శీరిష్ ‘ఊర్వశివో రాక్షసివో’ నుంచి మెలోడీ ట్రాక్.. మధురగాత్రంతో అదరగొట్టిన స్టార్ సింగర్!

అల్లు శీరీష్ - అను ఇమ్మాన్యుయేల్ జంటగా వస్తున్న చిత్రం ‘ఉర్వశివో రాక్షసివో’. ఈ చిత్రం నుంచి తాజాగా మెలోడీ ట్రాక్ ను రిలీజ్ చేశారు. ‘దీంతనాన’గా విడుదలైన సాంగ్ మళ్లీ మళ్లీ వినాలిపించేలా ఉంది. ప్రస్తుతం యూట్యూబ్ లో దూసుకుపోతోంది.
 

A Melody song from Allu Shirishs Urvashivo Rakshasivo Movie Out!
Author
First Published Oct 10, 2022, 1:30 PM IST

యంగ్ హీరో అల్లు శీరిష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఉర్వశివో రాక్షసివో’ (Urvashivo Rakshashivo). హీరోయిన్ గా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది. గతంలో 'ప్రేమ కాదంట' అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు 'ఊర్వశివో రాక్షసివో'గా ఆడియెన్స్ ముందుకు వస్తుంది. ఈ చిత్రానికి రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు.  ఇప్పటికే చిత్రీకరణ దాదాపుగా పూర్తికావడంతో చిత్ర ప్రచార  కార్యకక్రమాలను నెమ్మదిగా షురూ చేస్తున్నారు. ఈ సందర్బంగా  సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసేందుకు క్రేజీ అప్డేట్స్ ను వదులుతున్నారు. తాజాగా మెలోడీ సాంగ్ ను రిలీజ్ చేశారు.

ఇదివరకే రిలీజ్ చేసిన ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్ర టీజర్ కు అనూహ్య స్పందన లభించింది. ఇందులో భాగంగా నేడు మూవీ ఫస్ట్ సింగిల్ గా ‘దీంతననా’ (Dheemthanana) అనే రొమాంటిక్ సాంగ్ ను విడుదల చేశారు. లవ్ సాంగ్స్ స్పెషలిస్ట్, స్టార్ సింగర్ సిద్ధ్ శ్రీరామ్ (Sid Sriram) ఈ పాటను ఆలపించారు. పూర్ణచారి సాహిత్యం అందించారు. ‘నీ అడుగుల వెంట, నే గురుతై ఉంటా.. నీ పాదమే దాటు ప్రతిచోటునా, నీ పెదవులు తాకే  నా పేరును వింటా,  ఓ స్పర్శ కే పొంగిపోతానట, కాలం కలిపింది ఈ జోడి బాగుందని’ అని సాగే లిరిక్స్ మళ్లీ మళ్లీ వినాలించేలా ఉన్నాయి. ఈ పాటలో శిరీష్,అను ఇమ్మాన్యూల్ మధ్య కెమిస్ట్రీ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది. అలానే సిద్ శ్రీరామ్ హిట్ లిస్ట్ లో మరో క్లాసి మెలోడీ యాడ్ అయిందని చెప్పొచ్చు. చిత్రానికి అచ్చు రాజమణి  సంగీతం అందిస్తున్నారు.

భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్   లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన GA2 పిక్చర్స్ లో రాబోతున్న తదుపరి చిత్రమే ‘ఉర్వశివో రాక్షసివో’. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా.. ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌తో కలిసి జిఎ 2 పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. నవంబర్ 4న చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.  

 

Follow Us:
Download App:
  • android
  • ios