ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి వసూళ్ళ సునామీ సృష్టించింది కన్నడ సినిమా కెజియఫ్2. ఇండియన్ బాక్సాఫస్ ను షేక్ చేసిన ఈమూవీ టైమ్ లో కొన్ని అపశృతులు తప్పలేదు. ఇక రీసెంట్ గా కెజియఫ్ చూస్తూ ఓ వ్యక్తి మృతి చెందడం కలకలం రేపుతోంది.
ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి వసూళ్ళ సునామీ సృష్టించింది కన్నడ సినిమా కెజియఫ్2. ఇండియన్ బాక్సాఫస్ ను షేక్ చేసిన ఈమూవీ టైమ్ లో కొన్ని అపశృతులు తప్పలేదు. ఇక రీసెంట్ గా కెజియఫ్ చూస్తూ ఓ వ్యక్తి మృతి చెందడం కలకలం రేపుతోంది.
భారతీయ సినిమా వసూళ్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది కేజీఎఫ్-2. ఈ మూవీ దక్షణాది కంటే బాలీవుడ్ లోనే ఎక్కవ వసూళ్ళు సాధించింది. బాహుబలి2 తరువాతి స్థానంలో నిలిచింది. ఇక ఈమూవీకి ఇప్పటికీ థియేటర్లు ఫుల్ అవుతూనే ఉన్నాయి. అయితే రిలీజ్ అయ్యి చాలా రోజులు అవుతున్నా.. ఇంకా అక్కడక్కడ అపశృతులు తప్పడం లేదు.
కెజియఫ్2 సినిమా ప్రదర్శనకు సంబంధించి సోమవారం ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. ఏపీలోని ఏలూరు నగరంలో ఈ సినిమా చూస్తూ ఓ వ్యక్తి థియేటర్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన థియేటర్‌కు చేరుకుని మృతదేహాన్ని శవ పరీక్ష కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే సినిమా చూస్తుండగా ఆ వ్యక్తి ఏ కారణంతో చనిపోయాడన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వ్యక్తి ఎలా చనిపోయాడో తెలసుకునేందకు నెటిజన్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక వెయ్యి కోట్లు దాటిన కెజియఫ్ ఇంకా తన ప్రభంజనాన్ని కొనసాగిస్తూనే ఉంది.
ప్రశాంత్ నీల్ డైరెక్ష్ చేసిన ఈ సినిమాను హోంబెలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించారు. రాకీభాయ్ గా యష్ సరసన హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటించి మెప్పించింది. అధీరా పాత్రలో బాలీవుడ్ దాదా సంజయ్ దత్ నటించారు. ఇక కెజియఫ్ కు మరో సీక్వెల్ మూవీ ఉంటుందని ఈ మధ్యనే టీమ్ నుంచి సిగ్నల్స్ వచ్చాయి.
