డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కు టాలీవుడ్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. నిర్మాతల ఫ్రెండ్లీ డైరెక్టర్ పూరి జగన్నాధ్. బడ్జెట్ హద్దులు దాటకుండా తక్కువ టైంలో మంచి అవుట్ పుట్ తో పూరి సినిమాలు చేస్తుంటారు.

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కు టాలీవుడ్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. నిర్మాతల ఫ్రెండ్లీ డైరెక్టర్ పూరి జగన్నాధ్. బడ్జెట్ హద్దులు దాటకుండా తక్కువ టైంలో మంచి అవుట్ పుట్ తో పూరి సినిమాలు చేస్తుంటారు. భారీ కథలపై ఎక్కువగా ఆధారపడకుండా పూరి జగన్నాధ్ తన టేకింగ్ నే నమ్ముకుంటారు. యువత మెచ్చే కమర్షియల్ అంశాలు పూరి చిత్రాల్లో పక్కాగా ఉంటాయి. 

ప్రస్తుతం Puri Jagannadh రౌడీ హీరో విజయ్ దేవరకొండతో 'లైగర్' చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ముంబైలో ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. Liger షూటింగ్ లొకేషన్ కి పూరి కారులో వెళుతున్నప్పుడు ఆసక్తికర సంఘటన జరిగింది. ముంబైలో ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పూరి కారు ఆగింది. దీనితో ఓ కుర్రాడు పూరి జగన్నాధ్ ని గుర్తు పట్టాడు. కారు వెనుక నెంబర్ ప్లేట్ పై టీఎస్ అని ఉండడంతో ఎవరో తెలుగువారై ఉంటారని ఓ కుర్రాడు అటువైపు వచ్చాడు. కారు లోపల పూరి జగన్నాధ్ కనిపించడంతో అతడి మైండ్ బ్లాక్ అయింది. ఆ కుర్రాడి పేరు ప్రమోద్. 

మీకు చాలా పెద్ద అభిమానిని సర్.. టీఎస్ అని చూస్తే ఎవరో తెలుగు వారు అనుకున్నా.. లోపల చూస్తే మీరున్నారు.. నమ్మలేకపోతున్నా అంటూ ప్రమోద్ పూరి కి షేక్ హ్యాండ్ ఇస్తూ సంతోషంలో మునిగిపోయాడు. నా దగ్గర మొబైల్ లేదు లేకుంటే సెల్ఫీ తీసుకునేవాడిని అని ప్రమోద్ చెప్పాడు. ప్రస్తుతం తాను ఇంటర్మీడియట్ చదువుతున్నట్లు కూడా తెలిపాడు. దీనితో పూరి.. బాగా చదువుకో.. సమ్మర్ లో లైగర్ మూవీ రిలీజ్ అవుతుంది చూడు అని చెప్పారు. 

Also Read: షాకింగ్: తగ్గేదే లే, తేల్చి చేప్పేసిన భీమ్లా నాయక్ నిర్మాత.. బరిలో పాన్ ఇండియా చిత్రాలు ఉన్నా..

ఇక చార్మి ఆ కుర్రాడి కోసం చిన్న పని చేసింది. ప్రమోద్ వద్ద మొబైల్ లేదు. కాబట్టి ఈ వీడియోని ప్రమోద్ కోసం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నా అంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. పూరి, ప్రమోద్ మధ్య జరిగిన సంభాషణ వీడియోని Charmy Kaur అభిమానులతో షేర్ చేసుకుంది. 

ఇదిలా ఉండగా అనన్య పాండే, Vijay Devarakonda జంటగా నటిస్తున్న లైగర్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో పూరి జగన్నాధ్ ఈ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ లో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఓ పాత్రలో నటించబోతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.