ఈ మూవీలో రజనీకాంత్ మొయిదీన్ భాయ్‌ అనే స్పెషల్ రోల్‌తో అల‌రించ‌నున్నాడు. అయితే మొదటి నుంచి రజనీ గెస్ట్ రోల్ అని చెప్పినా ఇప్పుడు బిజినెస్ జరిగే సమయంలో ...


రజనీ కాంత్ సినిమాలకు క్రేజ్ తగ్గిపోయింది. అభిమానులు తప్పించి మిగతా జనం చూడటం లేదు అనుకన్న టైమ్ లో ఊహించని విధంగా జైలర్ మూవీతో సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి షాక్ ఇచ్చారు. ఇప్పుడు అదే ఊపులో ఆయన తాజాగా లాల్ సలామ్ మూవీ తో అభిమానులు, ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. అదే సమస్యగా గా మారింది. అదేమిటంటే.., లాల్ సలామ్ సినిమాలో రజనీకాంత్ అతిథి పాత్రలో కనువిందు చేయనున్నారు. ఆయన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన లాల్ సలామ్ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. 

మొదట ఈ సినిమాకు రజనీ ఒప్పుకున్నది కేవలం తన కూతురు దర్శకత్వం అనే అనేది నిజం. లేకపోతే రజనీ గెస్ట్ రోల్ లో చేయరు. కానీ టీజర్ రిలీజైన తర్వాత ఈ చిత్రానికి ఓ రేంజిలో క్రేజ్ పెరిగిపోయింది. ఈ టీజర్ లోని డైలాగులు వైరల్ అయ్యాయి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ని టీవిలో చూసి ఉంటారు. రేడియోలో విని ఉంటారు. కానీ డైరెక్ట్ గా చూశారా.. అంటూ క్రికెట్ మ్యాచ్‌తో ఈ టీజ‌ర్ ప్రారంభకాగా, ఇది స్పోర్ట్స్ డ్రామాలా కనిపిస్తుంది, అయితే ఈ మ్యాచ్ వ‌ల‌న హిందూ ముస్లింల‌ మధ్య గొడవలు జరిగినట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీలో రజనీకాంత్ మొయిదీన్ భాయ్‌ అనే స్పెషల్ రోల్‌తో అల‌రించ‌నున్నాడు. అయితే మొదటి నుంచి రజనీ గెస్ట్ రోల్ అని చెప్పినా ఇప్పుడు బిజినెస్ జరిగే సమయంలో రజనీ సినిమా అన్నట్లుగానే కొంటున్నారట.

టీజర్ లో రజనీపాత్ర ఉండటంతో ఆయన కీ రోల్ అనే బిజినెస్ జరుగుతోందని ట్రేడ్ అంటోంది. ఇవన్ని తెలుసుకున్న రజనీ ..తన పాత్రపై ఫ్యాన్స్ ఖచ్చితంగా నమ్మకం పెట్టుకుని తొలి రోజు వస్తారని, ఏ మాత్రం వారి ఎక్సపెక్టేషన్స్ కు తగ్గినా సినిమా బాగోలేదని అంటారని, కాబట్టి అవసరమైతే మరింత పెంచటమో లేక రీడిజైన్ చేయటమో చెప్పారని చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా తమ కుమార్తె డైరక్ట్ చేస్తున్న సినిమా కావటంతో ఎట్టి పరిస్దితుల్లోనూ హిట్ అవ్వాలని రజనీ చెప్పారట. అందులోనూ జైలర్ తర్వాత వస్తున్న చిత్రంకావటంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందిట.

అందులో భాగంగా కొన్ని సీన్స్ ని కీ యాక్టర్స్ తో కాంచీపురం, చెన్నైకు దగ్గర కొన్ని లొకేషన్స్ లో షూట్ ప్లాన్ చేసి తీస్తోందిట. ఏ యాస్పెక్ట్ లోనూ కాంప్రమైజ్ కాకూడదనే డెసిషన్ తీసుకుని ముందుకు వెళ్తోందిట. అయితే ఈ రీషూట్ సీన్స్ లో రజనీ సీన్స్ ఉన్నాయా లేవా అనేది తెలియాల్సి ఉంది. ‘లాల్‌సలామ్‌’ (Lal Salaam)లో విష్ణువిశాల్‌, విక్రాంత్‌ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌ దేవ్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన లాల్‌ సలామ్‌ టీజర్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరణ్‌ నిర్మిస్తుండగా.. ఏఆర్ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఒక చిన్న గ్రామంలో రెండు మతలా మధ్య వైరం, దానికి క్రికెట్ పోటీ వంటి భావోద్వేగాలతో లాల్ సలామ్ తెరకెక్కించినట్లు అర్థం అవుతోంది.