అభిమానానికి ఎల్లలు ఉండవంటారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ చేసిన ఓ పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందరూ ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు.
అభిమానానికి అనేక రూపాయలు. నచ్చిన హీరో కోసం రక్తదానం, అన్నదానం చేస్తారు అభిమానులు. ఇతర హీరోల అభిమానులతో కొట్లాడతారు. తమ హీరో కోసం ఎంతవరకైనా వెళతారు. ఒంటి మీద టాటూలు వేయించుకుంటారు. వాళ్ళు ధరించిన బట్టలను పోలిన బట్టలు వేసుకుంటారు. విగ్రహాలు కూడా కడతారు. చెప్పాలంటే ఇంకా చాలానే ఉన్నాయి. కాగా ఓ అభిమాని మరింత భిన్నంగా ఆలోచించాడు. తన కలల ఇంటిని ఎన్టీఆర్ పేరున నిర్మించుకోవాలి అనుకున్నాడు.
కొత్త ఇంటి నిర్మాణం చేపట్టిన ఎన్టీఆర్ అభిమాని ప్రతి ఇటుక మీద ఎన్టీఆర్ అనే పేరు వచ్చేలా తయారు చేయించాడు. బట్టీ కార్మికులకు చెప్పి ఎన్టీఆర్ పేరు అచ్చుతో ఇటుకలను రూపొందించాడు. నా ఇంటికి వాడిని ప్రతి ఇటుక మీద ఎన్టీఆర్ పేరు ఉండాలని అతడు కోరుకున్నాడట. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సదరు వ్యక్తి అభిమానానికి ఆశ్చర్యపోతున్నారు.
మరోవైపు ఎన్టీఆర్ దేవర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మొన్నటి వరకు హైదరాబాద్ లో వేసిన స్పెషల్ సెట్స్ లో షూటింగ్ జరిగింది. ప్రస్తుతం గోవాకు షిఫ్ట్ అయ్యింది. ప్రస్తుతం గోవాలో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. అనంతరం వైజాగ్ తో పాటు మరికొన్ని తీరా ప్రాంతాల్లో షూటింగ్ జరగనుందని సమాచారం.
దేవర మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడని సమాచారం. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నాడు. శ్రీకాంత్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. 2024 ఏప్రిల్ 5న దేవర విడుదల కానుంది.
