బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ని పెళ్లిచేసుకోండి అంటూ ఓ అభిమాని స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ని రిక్వెస్ట్ చేశాడు. దీనికి ఆమె చెప్పిన సమాధానం అందరినీ కన్ఫ్యూజన్ లో పడేసింది. సల్మాన్ ఖాన్, కత్రినాల మధ్య మంచి బంధం ఉన్న సంగతి తెలిసిందే. 

గతంలో వీరిద్దరూ కలిసి డేటింగ్ చేశారని, పెళ్లి చేసుకుంటారని వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో తాజాగా కత్రినా ఓ కార్యక్రమానికి హాజరైంది. ఆ కార్యక్రమానికి వచ్చిన ఓ వ్యక్తి సల్మాన్, కత్రినా జంటగా నటిస్తోన్న 'భారత్' సినిమా పోస్టర్ పట్టుకొని దానిపై 'ప్లీజ్ మేడం.. సల్మాన్ మీకు పర్ఫెక్ట్. ఆయన్ని పెళ్లి చేసుకోండి' అని రాశారు.

ఆ పోస్టర్ చూసిన కత్రినా.. 'హుమ్(Hmm.. నీ ప్రశ్నకి ఇదే నా రియాక్షన్' అంటూ సమాధానమిచ్చింది. అయితే కత్రినా ఇచ్చిన రియాక్షన్ పెళ్లికి ఓకే చెప్పినట్లా..? కాదా..? అని అర్ధంకాకుండా ఉంది.

గతంలో కత్రినా, సల్మాన్ ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఈ జంట కలిసి నటిస్తోన్న 'భారత్' ఈ రంజాన్ కాకుండా ప్రేక్షకుల ముందుకు రానుంది.