రీసెంట్ గా నటి శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ పై మాట్లాడిన సంగతి తెలిసిందే. ఓ మీడియా ఛానల్ కు లైవ్ ఇంటర్వ్యూలను కూడా ఇచ్చింది. ఆ ఛానల్ నిర్వహించిన క్యాస్టింగ్ కౌచ్ స్టింగ్ ఆపరేషన్ లో దొరికిన టాలీవుడ్ బడా డైరెక్టర్ ఆపరేషన్ లో ఓ టాప్ డైరెక్టర్ దొరికాడట. గ్రామాలను ఉద్ధరించడం.. రాజకీయాలను మార్చేయడం అంటూ నీతులు చెప్పే సినిమాలను తీస్తాడంటూ ఆ దర్శకుడు గురించి బాగానే లీకులు ఇచ్చారు. పైగా ఈ దర్శకుడితో పాటు ఓ బడా నిర్మాణ సంస్థ కుటుంబానికి చెందిన వ్యక్తి కూడా ఉన్నాడట. వీరికి తోడు ఓ ముంబై కో-ఆర్డినేటర్ కూడా దొరికాడని.. ఆ మీడియా దగ్గర మొత్తం సాక్ష్యాలు ఉన్నాయని ఆ కథనం సారాంశం. 

అయితే.. కోఆర్టినేటర్ పేరు తప్ప మిగిలిన ఇద్దరి పేర్లను మీడియా బైట పెట్టలేదు. ఈ టాప్ డైరెక్టర్ వ్యవహారమే ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశం అయింది. పైగా ఆ దర్శకుడి పేరు మేము చెప్పకపోయినా.. అతనెవరో హింట్స్ ఇస్తూ.. ఇప్పటికే మీకు అర్ధమైంది కదా అంటూ వ్యాఖ్యానించడం విశేషం. ఊళ్లను ఉద్ధరించడంతో పాటు.. అమ్మాయిల కెరీర్ లను ఉద్ధరిస్తానంటూ వారిని ఆ దర్శకుడు వాడుకుంటున్నాడనే ఆరోపణలు సంచలనం అయ్యాయి.