హీరోయిన్ రవీనా టాండన్ పై దాడి... కొట్టొదని వేడుకున్న కెజిఎఫ్ 2 నటి! అసలు ఏం జరిగింది?

సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ పై కొందరు వ్యక్తులు దాడి చేశారు. రవీనా టాండన్ కొట్టొదని వేడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. 
 

a family attacks heroine raveena tandon video going viral ksr

హీరోయిన్ రవీనా టాండన్ పై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ముంబైలో ఈ ఘటన చోటు చేసుకుంది. రవీనా టాండన్ పై దాడి చేస్తున్న వీడియో వైరల్ అవుతుంది. ముంబై బాంద్రా రిజ్వీ లా కాలేజ్ వద్ద సంఘటన చోటు చేసుకుంది. రవీనా ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ వేగంగా ఎదుట ఉన్న కారును గుద్దినట్లు సమాచారం. దాంతో ఎదుట కారులో ఉన్నవారికి గాయాలు అయ్యాయట. బాధితులు దిగి రవీనా కారు డ్రైవర్ ని కొడుతుండగా... రవీనా వారిని ఆపే ప్రయత్నం చేసిందట. రవీనా ఎంట్రీతో వివాదం మరింత పెద్దది అయ్యిందట. 

ఈ క్రమంలో రవీనా మీద కూడా దాడి జరిగింది. మద్యం మత్తులో ఉన్న రవీనా, ఆమె డ్రైవర్ ఓ పెద్దావిడ మీద దాడి చేశారనే వాదన కూడా వినిపిస్తోంది. వీడియోలో రవీనా కొట్టొదని, వీడియోలు తీయొద్దని వేడుకున్నారు. రవీనా టాండన్, ఆమె డ్రైవర్ పై ఆ కుటుంబం కేసు పెట్టినట్లు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది. 

రవీనా టాండన్ 90లలో స్టార్ హీరోయిన్. బాలీవుడ్ లో అత్యధికంగా నటించిన రవీనా తెలుగులో కూడా కొన్ని చిత్రాలు చేశారు. బంగారు బుల్లోడు చిత్రంలో బాలయ్యతో ఆమె జతకట్టింది. అలాగే నాగార్జునకు జంటగా ఆకాశ వీధిలో చిత్రం చేసింది. మంచు హీరోల పాండవులు పాండవులు తుమ్మెద చిత్రంలో ఓ కీలక రోల్ చేసింది. 

కాగా కెజిఎఫ్ 2లో రవీనా టాండన్ కీలకమైన లేడీ ప్రధాని పాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో రవీనా టాండన్ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ప్రస్తుతం వెల్కమ్ టు ది జంగిల్, గుడ్చడీ టైటిల్స్ తో రెండు చిత్రాలు చేస్తుంది. 2004లో అనిల్ తడానీ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి నలుగురు సంతానం. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios