సమ్మర్ లో పెద్ద సినిమాల బెడద ఉండడంతో చిన్న సినిమాల రిలీజ్ ని జూన్ కి షిఫ్ట్ చేశారు. మరికొద్ది రోజుల్లో కాస్త పేరున్న సినిమాలు రిలీజ్ కి ఉండడంతో ఈ వారంలో మంచి డేట్ అని భావించిన చిన్న చిత్రాల నిర్మాతలు తమ సినిమాలను రిలీజ్ కి సిద్ధం చేస్తున్నాయి. 

ప్రస్తుతం థియేటర్ లో ఒక్క సరైన సినిమా కూడా లేకపోవడంతో ఈ వారాన్ని క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నారు. ఈ శుక్రవారం నాడు ఒకటి కాదు రెండు కాదు మొత్తం ఆరు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇవి చాలవన్నట్లు కొన్ని అనువాద చిత్రాలు కూడా ఉన్నాయి.

వాటిలో 'మల్లేశం', 'ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ', 'ఫస్ట్ ర్యాంక్ రాజు' వంటి చిత్రాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ప్రమోషన్స్ ముమ్మరంగా చేస్తుండడంతో ఈ  సినిమాలకు కాస్త బజ్ ఏర్పడింది. అలానే చాలా కాలంగా విడుదలకు నోచుకోకుండా ఆగిపోయిన విష్ణు 'ఓటర్'తో పాటు 'స్పెషల్', 'స్టువర్ట్ పురం' వంటి సినిమాలు కూడా శుక్రవారమే విడుదల చేస్తున్నారు.

మరి ఇన్ని సినిమాల మధ్య ఎన్ని సినిమాలు గట్టెక్కుతాయో..? ప్రేక్షకులు ఏ సినిమాను ఆదరిస్తారో అంచనా వేయలేని పరిస్థితి. ఈ మధ్యకాలంలో విడుదలైన ఏ సినిమా కూడా వారం రోజుల పాటు బాక్సాఫీస్ వద్ద నిలవలేకపోయింది. మరి ఈ చిన్న చిత్రాలైనా.. సత్తా చాటుతాయో లేదో చూద్దాం!