Asianet News TeluguAsianet News Telugu

‘గేమ్ ఛేంజర్’ సాంగ్ లీక్ పై దిల్ రాజ్ సీరియస్.. క్రిమినల్ కేసు ఫైల్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్

‘గేమ్ ఛేంజర్’ నుంచి రీసెంట్ గా ఓ సాంగ్ లీకై సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం పట్ల ప్రొడ్యూసర్ దిల్ రాజ్ సీరియస్ అయ్యారు. లీక్ చేసిన వారిపై యాక్షన్ తీసుకునేందుకు క్రిమినల్ కేసు ఫైల్ చేశారు. 
 

A criminal case has been filed against the people who leaked the contents of Game Changer NSK
Author
First Published Sep 16, 2023, 6:12 PM IST

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ (Dil Raju)  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై 50కి పైగా సినిమాలు నిర్మించారు. SVC50వ చిత్రంగా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)  రూపుదిద్దుకుంటోంది. భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)  హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలోనే ఉంది. 

అయితే, ఈ సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియెన్స్ కూడా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి తారాస్థాయిలో ఉంది. ఈ క్రమంలోనే కొందరు మూవీ నుంచి చరణ్ లుక్స్, హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్, షూటింగ్ వీడియోలు, సాంగ్స్ ను లీక్ చేస్తూ వస్తున్నారు. అవి నెట్టింట వైరల్ గా మారుతున్న విషయం తెలిసిందే. అప్పట్లోనే శంకర్ లీక్ ల అంశంపై హెచ్చరించారు. అయినా రీసెంట్ గా ఓ సాంగ్ లీకవ్వడం హాట్ టాపిక్ గ్గా మారింది. 

‘గేమ్ ఛేంజర్’లోని ‘జరగండి జరగండి’ అనే సాంగ్ బేసిక్ వెర్షన్ రెండ్రోజుల కింద సోషల్ మీడియాలో లీకైంది. కొద్ది గంటల్లోనే విపరీతంగా వైరల్ అయ్యింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ దాకా చేరడంతో విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. లీక్ లను అరికట్టేందుకు ఈరోజు హైదరాబాద్ సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేశారు. ఐపీసీ 66(సీ) సెక్షన్ కింద క్రిమినల్ కేసు ఫైల్ చేయించారు. ఈవిషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.

తమ సినిమా ‘గేమ్ ఛేంజర్’ నుంచి ‘జరగండి జరగండి’ బేసిక్ వెర్షన్ సాంగ్ ను లీక్ చేసిన వారిపై యాక్షన్ తీసుకోవాలని కోరారు. అలాగే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో, వాట్సాప్ లో కూడా షేర్ చేసిన వారిపైనా చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ లో పేర్కొన్నారు. ఈ చిత్రానికి మొదటి నుంచి లీక్ ల బెడద ఉండటం.. తాజాగా ప్రొడ్యూసర్ దిల్ రాజ్ స్ట్రాంగ్ గా బదులివ్వడంతో లీక్ లకు ఫుల్ స్టాప్ పడినట్లైంది. 

ఈ చిత్రం పొలిటికల్ డ్రామా రూపుదిద్దుకుంటోంది. చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోంది. ఆయా పాత్రల్లో భారీ తారాగణం అలరించనుంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ భారీ ప్రాజెక్ట్ కు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే చాలా మేరకు చిత్రీకరణ పూర్తైంది. మరిన్ని షెడ్యూళ్లో షూటింగ్ పార్ట్ కంప్లీట్ కానుంది. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios