బాహుబలి విజయం తరువాత రాజమౌళి క్రేజ్ దేశవ్యాప్తం కాగా.. ఆయన లేటెస్ట్ మూవీ ఆర్ ఆర్ ఆర్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. భాషతో సంబంధం లేకుండా ఆర్ ఆర్ ఆర్ కోసం దేశం మొత్తం ఎదురుచూస్తుంది. టాలీవుడ్ కి చెందిన ఎన్టీఆర్, చరణ్ లాంటి టాప్ స్టార్స్ కలిసి నటించడం కూడా మూవీపై భారీ హైప్ కి కారణం అయ్యింది. ఇక ఈ మూవీ కున్న క్రేజ్ ఏమిటో చెప్పడానికి తాజా ఉదంతం ఉదాహరణగా చెప్పవచ్చు. ఇంగ్లండ్‌తో ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 3–2తో గెలుచుకున్న విషయం తెలిసిందే. చివరి టీ20ల్లో ఓపెనర్లుగా దిగిన విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ చక్కటి భాగస్వామ్యం నెలకొల్పారు. 

ఈ జోడి 94 పరుగుల భాగస్వామ్యాన్ని నెలక్పొంది. కోహ్లీ 52 బంతుల్లో 80 పరుగులు చేసి నాటవుట్ గా నిలవగా... రోహిత్ శర్మ 34 బంతుల్లో 64 పరుగులు సాధించి క్విక్ హాఫ్ సెంచరీ పూర్తి చేశారు. కోహ్లీ, రోహిత్ శర్మల విధ్వసంసక బ్యాటింగ్ ని ప్రముఖ వెబ్ సైట్ ఆర్ ఆర్ ఆర్ పాత్రలైనా భీమ్, రామరాజులతో పోల్చింది. ‌ప్రముఖ క్రికెట్ అప్డేటింగ్ సంస్థ  క్రిక్‌ ట్రాకర్‌  తమ ట్వీట్టర్‌ అకౌంట్‌లో విరాట్‌ కోహ్లిను రామరాజు(అగ్ని)తో , రోహిత్‌ శర్మను కొమరంభీమ్‌ (నీరు) పోల్చుతూ ట్వీట్‌ను వేసింది.  ఈ ట్వీట్‌ను రీ షేర్‌ చేస్తూ ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ ఆసక్తికర ట్వీట్‌ను వేసింది. ఫైర్‌బ్రాండ్‌ విరాట్‌ కోహ్లి , మిస్లర్‌ కూల్‌ రోహిత్‌ శర్మల కలయిక ఒక సంచలనం. కప్పును గెలవండి అంటూ  ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ అధికారిక ఖాతానుంచి ట్వీట్‌ వేసింది.

మరో వైపు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే కీలక పతాక సన్నివేశాలను తెరకెక్కించినట్లు చిత్ర వర్గాలు సోషల్ మీడియా ద్వారా తెలియజేశాయి. రామరాజు పాత్ర చేస్తున్న చరణ్ జంటగా నటిస్తున్న అలియా పాత్ర సీత లుక్ ని ఆమె పుట్టినరోజు కానుకగా విడుదల చేశారు. ఇక అక్టోబర్ 13న ఆర్ ఆర్ ఆర్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే రెండు సార్లు వాయిదాపడిన నేపథ్యంలో మూవీ త్వరగా విడుదల చేసేలా రాజమౌళి ప్రణాళికలు వేస్తున్నారు. 
ఆర్ ఆర్ ఆర్,