Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ కి సవాల్ విసురుతున్న రాజమనార్... జగ్గూ భాయ్ మరింత క్రూరంగా

జగపతి బాబును రాజమనార్ గా చూపిస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. జగ్గూ భాయ్ రస్టిక్ లుక్ లో ఉన్న బ్లాక్ అండ్ వైట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ప్రభాస్ కి సవాల్ విసిరే సీరియస్ విలన్ గా జగపతి బాబు ఓ పవర్ఫుల్ రోల్ చేస్తున్నట్లు ఫస్ట్ లుక్ ద్వారా అర్థం అవుతుంది.

a challenging villain for prabhas from salaar jagapathi babu as rajamanaar
Author
Hyderabad, First Published Aug 23, 2021, 12:47 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సలార్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2022 సమ్మర్ కానుకగా విడుదల కానున్న ఈ మూవీ గురించి దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. సినిమాపై ఉన్న క్రేజ్ రీత్యా, అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా నేడు సలార్ చిత్రం రాజమనార్ పాత్రను పరిచయం చేశారు. 
 

జగపతి బాబును రాజమనార్ గా చూపిస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. జగ్గూ భాయ్ రస్టిక్ లుక్ లో ఉన్న బ్లాక్ అండ్ వైట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ప్రభాస్ కి సవాల్ విసిరే సీరియస్ విలన్ గా జగపతి బాబు ఓ పవర్ఫుల్ రోల్ చేస్తున్నట్లు ఫస్ట్ లుక్ ద్వారా అర్థం అవుతుంది. చేతిలో చుట్ట, ముక్కుకు పోగు కలిగి ఊరమాస్ లుక్ లో జగపతి బాబు సరికొత్తగా ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా జగపతి బాబు తన లుక్ పై స్పందించారు. నా వరస్ట్ లుక్స్ లో బెస్ట్ ఇదే... ప్రశాంత్ నీల్ సహాయంతో మంచి నటన రాబట్టాను. చిత్ర యూనిట్ కి నా కృతజ్ఞతలు అంటూ జగపతి ట్విట్టర్ పోస్ట్ చేశారు. 


శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సలార్ షూటింగ్ చాలా వరకు జరుపుకుంది. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగండూర్ నిర్మించారు. కన్నడ, తెలుగు భాషలలో ఏకకాలంలో చిత్రీకరించబడిన ఈ చిత్రం హిందీ, తమిళం, మలయాళంలో కూడా డబ్ చేయబడుతుంది. రవి బస్రూర్ సంగీతం సమకూర్చగా, సినిమాటోగ్రఫీ భువన్ గౌడ నిర్వహిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios