ఈసారి ఆస్కార్ వేడుకలు ప్రత్యేకం కానున్నాయి. దాంతో ఇప్పటి వరకూ ఆస్కార్ ను లైవ్ లోచూడని వారు కూడా.. ఈసారి లైవ్ స్క్రీమింగ్ ఎక్కడ దొరుకుతుందబ్బా అని సెర్చ్ చేస్తున్నారు జనాలు. ఇంతకీ ఆస్కార్ వేడుకలు లైవ్ ను ఎవరు ఇవ్వబోతున్నారంటే..?
95వ ఆస్కార్ వేడుకలు ఇండియన్ ఆడియన్స్ కు ప్రత్యేకం కాబోతున్నాయి. ఇవి మనకు ఎందుకు ప్రత్యేకమో అదరికి తెలిసిందే. ఈసారి ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ సినిమా ఉండటం.. ఆస్కార్ వేదికపై మన తెలుగు సింగర్ల పెర్ఫామెన్స్ లు కూడా ఉండటంతో ఆస్కార్ వేడుకలపై ఇండియన్స్ ముఖ్యంగ తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ ఉత్సాహం చూపిస్తున్నారు. అంతే కాదు... లైవ్ ప్రోగ్రామ్ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందా అని వెతకడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ఆస్కార్ వేడుకల వేదిక నుంచి లైవ్ ఓటీటీలో కూడా అవ్వబోతున్నట్టు సమాచారం.
వరల్డ్ వైడ్ గా ఆస్కార్ అవార్డుల పురస్కారాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. అలాగే ఆ అవార్డ్స్ లో విజేతలుగా నిలిచిన వారు ఎవరో తెలుసుకోడానికి ఎంతో ఆసక్తిని కూడా కనబరుస్తారు. అయితే ఆర్ఆర్ఆర్ వల్ల ఇండియాలో ఈసారి ఆ ఆసక్తి మరి కొంచెం ఎక్కువుగా ఉంది. ట్రిపుల్ ఆర్ ఎలాగైనా ఆస్కార్ సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు మేకర్స్.. మేకర్స్ తో పాటు ఇండియా అంతా పక్కాగా నాటునాటు సాంగ్ కు ఆస్కార్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. అయితే ఇంతటి హిట్ సాధించిన ఈ సినిమాను ప్రభుత్వం ఆస్కార్ కి పంపించకపోవడం బాధాకరం. తనసొంత స్టామినాతో.. ట్రిపుల్ ఆర్ సినిమాను ఆస్కార్ నామినేషన్ వరకూ తీసుకెళ్లాడు దర్శకుడు రాజమౌళి.
మన ప్రభుత్వం ఆర్ఆర్ఆర్ ను గుర్తించకపోయినా.. సొంతంగా ఆస్కార్ నామినేషన్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి హిస్టరీ క్రియేట్ చేసింది సినిమా. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ రేస్ లో పోటీ పడుతుంది. ఇక ఈ సినిమా పై హాలీవుడ్ ఆడియన్స్ తో పాటు స్టార్ డైరెక్టర్స్ కూడా ఇంట్రెస్ట్ తో ఉన్నారు. నాటునాటు సాంగ్ ఆస్కార్ గెలవాలని హాలీవుడ్ జనాలు కూడా కోరుకుంటున్నారు.
ఇక మార్చి 12న జరగబోయే ఆస్కార్ అవార్డుల వేడుకలను ఎక్కడ లైవ్ చూడవచ్చు అని సెర్చ్ చేస్తున్నారు జనాలు. ఈక్రమంలో.. ఆడియన్స్ ఆసక్తిని గమనించిన ఓటిటి ప్లాట్‌ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ అవార్డుల వేడుకను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు సై అంది. 95వ ఆస్కార్ అవార్డులను తాము లైవ్ పెట్టబోతున్నట్టు ప్రకటించారు. ఆమెరికన్ కాలమానం ప్రకారం 12 సాయంత్రం 5.30 కి వేడుకలు స్టార్ట్అవుతాయి. ఇక ఇండియన్ టైం ప్రకారం మార్చి 13న ఉదయం 5:30 నిముషాలు నుంచి ప్రసారం చేయబోతున్నట్లు అధికారికంగా తెలియజేశారు.
ఇక ఈసారి ఆస్కార్ లో మరో ప్రత్యేకత ఏంటీ అంటే.. ఆస్కార్ అవార్డుల వేడుక పై నాటు నాటు సాంగ్ ని సింగర్స్ కాలభైరవ, రాహుల్ సిప్లిగుంజ్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. మొదటి సారి తెలుగు వారికి దక్కిన గౌరవం ఇది. అంతే కాదు నాటు నాటు సాంగ్ ను ఎన్టీఆర్, తారక్ కలిసి లైఫ్ లె పెర్ఫామెన్స్ ఇవ్వబోతున్నట్టు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది. చూడాలి మరి ఈసారి ఆస్కార్ .. తెలుగు వారికి మరువలేని గౌరవాన్నిఅందిస్తుందా లేదా అని..?
