Asianet News TeluguAsianet News Telugu

7/G బృందావనం కాలనీ హీరో ఇప్పుడెలా ఉన్నాడో చూశారా.? గుర్తుపట్టడం కష్టమే..

7/G బృందావనం కాలనీ.. మళ్లీ థియేటర్లలో సందడి చేయబోతోంది. రీసెంట్ రీరిలీజ్ ట్రైలర్ కూడా విడుదలైంది. ఈవెంట్ కు హాజరైన హీరో రవికృష్ణ ఎలాఉన్నారో చూస్తే షాక్ అయిపోతారు. 
 

7g brundavan colony Hero Ravi Krishna Latest Look NSK
Author
First Published Sep 17, 2023, 4:29 PM IST

7/G Rainbow Colony చిత్రంతో తమిళం, తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యారు హీరో రవి కృష్ణ. కోలీవుడ్ లో ఆయనకు ఇదే తొలిచిత్రం. ప్రముఖ నిర్మాత ఎంఏం రత్నం కొడుకుగా హీరోగా పరిచయం అయ్యారు. ఈ చిత్రానికి  సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు. సోనియా అగర్వాల్ కథానాయి. సుమన్ శెట్టి, చంద్రమోహన్ కీలక పాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం ఇప్పటికీ సంగీత ప్రియులు మరిచిపోలేదు. 

అయితే, దాదాపు 20 ఏళ్ల కింద 7/జీ బృందానం కాలనీ చిత్రంతో రవి కృష్ణ (Ravi Krishna) హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత తమిళం, తెలుగులో కొన్నాళ్లు వరుసగా సినిమాలు చేశారు. 2011 తర్వాత సినిమాలకు దూరమయ్యారు. 12 ఏళ్లుగా ఈ హీరో ఎక్కడా పెద్దగా కనిపించలేదు. ఇక ‘7/జీ బృందావనం కాలనీ’ చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్న సందర్భంగా ఇటీవల తెలుగు వెర్షన్ రీరిలీజ్ ట్రైలర్ విడుదల చేసేందుకు ఈవెంట్ ఏర్పాటు చేశారు. చిత్ర యూనిట్ హాజరైంది. 

ఈ సందర్భంగా రవికృష్ణను చూసిన వారందరూ షాక్ అయ్యారు. చాలా కాలంగా కనిపించకపోవడంతో ఒక్కసారిగా ఆయన్న చూసి గుర్తు పట్టలేకపోతున్నారు. ప్రస్తుతం ఆయన లావుగా మారిపోయారు. ఫేస్ పూర్తిగా బుగ్గలతో నిండిపోయింది. దీంతో సడెన్ గా చూసిన వారు గుర్తుపట్టడం కష్టమే అన్నట్టుగా లేటెస్ట్ లుక్ ఉంది. ప్రస్తుతం ఆయన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. 

7g brundavan colony Hero Ravi Krishna Latest Look NSK

ఇక యూత్ ను ఎంతగానో అలరించిన 7/జీ బృందావనం కాలనీ చిత్రం సెప్టెంబర్ 22న థియేటర్లలో రీరిలీజ్ కాబోతోంది. ఇప్పటికీ చిత్రంలోని పలు సన్నివేశాలు, పాటలు, కామెడీ సీన్స్  నెట్టింట వైరల్ అవుతూనే ఉన్న విషయం తెలిసిందే. చిత్రం మరోసారి వెండితెరపై రాబోతుండటంతో సినీ ప్రియులు ఖుషీ అవుతున్నారు. 

7g brundavan colony Hero Ravi Krishna Latest Look NSK

Follow Us:
Download App:
  • android
  • ios