దేశభక్తి నరనరాన నిండేలా.. ఉత్తేజ పరిచే తెలుగు సినిమా డైలాగ్స్.. ఎప్పుడైనా విన్నారా..?
ఒకప్పుడు బ్రిటీష్ వారిని తరిమేయడానికి దేశ భక్తిని నరనరాన నింపుకులు.. ఉప్పోంగే ఉత్సాహంతో ఉద్యమం చేశారు మన పూర్వికులు. ఇక వారి ఆవేశాన్ని.. అప్పటి ఉద్యమాల స్పూర్తిని రగిల్చేందుకు.. ఈతరం సినిమాల్లో ఎన్నో డైలాగ్స్ ను ఆవేశంతో.. దేశ భక్తితో రాశారు రచయితలు. మరి దేశ భక్తిని ఉప్పోంగెలే చేసిన తెలుగు సినిమా డైలాగ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
ప్రజల మీద సినిమా ప్రభావం ఎక్కువ. అందుకే ఏదైనా మెసేజ్ ఇవ్వాలి అనకుంటే చాలా మంది సినిమాను నమ్ముకుంటున్నారు ఈ మధ్య. అలాగే మన దేశ స్వాతంత్ర ఉద్యమాలు.. దేశనికి సేవ చేసి అమరులైన వారి జీవితాలు సినిమాలుగా వస్తుంటాయి. అందులో దేశ భక్తిని నింపే పవర్ ఫుల్ డైలాగ్స్ కూడా మనం వింటుుంటాం. అటువంటి వాటిలో ఇప్పటికే ప్రతీ ఒక్కరి నోట వినిపిస్తున్న కొన్ని డైలాగ్స్ చూసుకుంటే..?
దేశ భక్తి సినిమాలు అందులోను తెలుగులో వచ్చిన సినిమాల్లో ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోయి ఉంటుంది అల్లూరి సీతారామరాజు సినిమా. ఈసినిమాలో కృష్ణ చెప్పే ప్రతీ డైలాగ్ ఒక్కొ ఆనిముత్యంలా మెరుస్తుంది. ప్రతీ భారతీయ హృదయం మురిసేలా.. బ్రిటీస్ వారికి చెంపపెట్టులా ఆయన చెప్పిన డైలాగ్స్ అద్భుతంగా పేలాయి. 1974 లో వచ్చిన ఈసినిమాలో ఒక్క సీతారామరాజు చనిపోతే.. వందలాది సీతారాములు పుడతారు అంటూ.. కంటీన్యూ చేసే డైలాగ్.. ఇప్పటికికి ఒళ్ళు గగుడ్పొడిచేలా ఉంటుంది.
ఇక నవరస నటసార్వభౌముడు.. నందమూరి తారక రామారావు చివరి రోజుల్లో నటించిన సినిమా మేజర్ చంద్రకాంత్. అడుగడుగున దేశ భక్తి ఉప్పోంగేలా తీర్చి దిద్దిన ఈసినిమాలో రామారావు ఒక్కొడైలాగ్..ఒక్కో బాణంలా.. దుర్మార్గుల గుండెలు చీల్చేస్తుంది. తరువాత తరానికి దేశం గురించి.. దేశ భక్తి గురించి ఆయన చెప్పిన మాటలు.. డైలాగ్స్ అద్భుతంగా అనిపిస్తాయి.. ఒరేయ్ తెల్లకుక్కా..ఎందుక కట్టాలిరా సిస్తు.. నారుపోశావా నీరు పెట్టావా అంటూ.. ఈసినిమాలో డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే.
ఇక వివాదాస్పందమైన కృష్ణ వంశీ ఖడ్గం సినిమాలో కూడా డైలాగ్స్ అద్భుతంగా పేలాయి.. పాకిస్తాను గురించి.. ప్రస్తావన వచ్చినప్పుడు..హిందూ ముస్లిం ల గురించి వివాదం చెలరేగినప్పుడు ముస్లిం యువకుడిగా నటించిన ప్రకాశ్ రాజ్ చెప్పే డైలాగ్స్ ప్రతీ ఒక్కరిని ఆలోచింపచేస్తాయి. హిందూ..ముస్లీం భాయి భాయ్ అనేలా చేస్తాయి. ప్రతీ ఒక్కరికి దేశ పట్ల ఉన్న బాధ్యతను గుర్తు చేస్తాయి.
ఇక ప్లాప్ సినిమాగా ముద్రు పడ్డా.. విక్టరీ వెంకటేష్ నటించిన సుభాశ్ చంద్రబోస్ సినిమాలో కూడా దేశ భక్తి చాటేలా ఎన్నో డైలాగ్స్ ఉన్నాయి. ఎందరో మహానుభావులు దేశానికి స్వాతంత్ర తీసుకురావడం కోసం కష్టపడితే... ఎటువంటి శ్రమలేకుండా.. కొంత మంది దేశం పేరు చెప్పుకుని బోగాలు అనుభవిస్తున్నారు. అటువంటివారికి చెంపపెట్టులా.. వెంకటేష్ చెప్పే డైలాగ్స్ ప్రతీ ఒక్కరిని ఆకట్టుకున్నాయి.
ఇవే కాదు.. టెర్రరిస్ట్ లు నేపథ్యంలో తెరకెక్కిన రోజా సినిమాలో కూడా దేశానికి సబంధించిన డైలాగ్స్ గూజ్ బామ్స్ తెప్పిస్తాయి. దుర్మార్గుల మధ్య ఉన్నా కాని.. దేశ భక్తిని చాటుకుంటూ.. వారికి ఎదురొడ్డి నిలుచున్న ఓ సైనికుడు.. దేశానికి సబంధించిన త్యాగం.. గురించి చెప్పిన మాటలు ప్రతీ ఒక్కరిని ఆలోచింపచేస్తాయి.. దేశం కోసం చావును సైతం లెక్క చేయని ధైర్యాన్ని చూసి.. ప్రతి ఒక్కరిలో దేశ భక్తి పెరిగిపోతోంది.