67వ జాతీయ అవార్డుల ప్రకటన వచ్చేసింది. ఉత్తమ తెలుగు చిత్రంగా `జెర్సీ` చిత్రం ఎంపికైంది. నాని హీరోగా, శ్రద్ధా శ్రీనాథ్‌ జంటగా ఈ చిత్రానికి గౌతమ్‌ తిన్ననూరు దర్శకత్వం వహించారు. 2019లో ఈ సినిమా రూపొంది ఘన విజయం సాధించింది. 

67వ జాతీయ అవార్డుల ప్రకటన వచ్చేసింది. ఉత్తమ తెలుగు చిత్రంగా `జెర్సీ` చిత్రం ఎంపికైంది. నాని హీరోగా, శ్రద్ధా శ్రీనాథ్‌ జంటగా ఈ చిత్రానికి గౌతమ్‌ తిన్ననూరు దర్శకత్వం వహించారు. 2019లో ఈ సినిమా రూపొంది ఘన విజయం సాధించింది. తాజాగా ప్రాంతీయ భాష చిత్రాల విభాగంలో తెలుగు నుంచి ఇది జాతీయ అవార్డుని దక్కించుకోవడం విశేషం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.

అంతేకాదు ఇది మరో జాతీయ అవార్డుని అందుకుంది. ఎడిటింగ్‌ విభాగంలో జాతీయ అవార్డుని సొంతం చేసుకుంది. నవీన్‌ నూలి ఎడిటింగ్‌ విభాగంలో ఎంపికయ్యారు. దీంతో ఇప్పటి రెండు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే తమిళంలో ఉత్తమ చిత్రంగా ధనుష్‌ నటించిన `అసురన్‌` ఎంపికైంది. హిందీలో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ నటించిన `చిచ్చోర్‌` చిత్రానికి దక్కింది. 

ఉత్తమ నటుడి విభాగంలో ఇద్దరు నటులను ఎంపిక చేశారు. `అసురన్‌` చిత్రానికి ధనుష్‌, హిందీలో మనోజ్‌ బాజ్‌పాయ్‌లను ఎంపిక చేశారు. మరోవైపు ఉత్తమ నటిగా `మణికర్ణిక`, `పంగా` చిత్రాలకుగానూ కంగనా రనౌత్‌లను ఎంపిక చేశారు. 2019లో విడుదలైన సినిమాలకు గానూ ఈ అవార్డులను ప్రకటించారు.