అక్కినేని అఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం 'మిస్టర్ మజ్ను'. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సినిమా ట్రైలర్ యూత్ కి ఎక్కువగా కనెక్ట్ కావడంతో యూట్యూబ్ లో మంచి వ్యూస్ ని సాధిస్తోంది. ఇప్పటివరకు ట్రైలర్ ఆరు మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసేసింది. ఈ విషయాన్ని అధికారికంగా పోస్టర్ ద్వారా ప్రకటించింది చిత్రబృందం.

ట్రైలర్ ని చూసిన వారందంటూ ఈ సినిమా ఆరెంజ్ సినిమా మాదిరి ఉంటుందా అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ప్లే బాయ్ లా తిరిగే ఓ యువకుడు యువకుడు ప్రేమ, పెళ్లి విలువ తెలుసుకొని చివరకు ఎలా మారుతాడనే లైన్ తో ఈ సినిమాను రూపొందించారు.

జనవరి 25న సోలోగా ఈ సినిమా బాక్సాఫీస్ ముందుకు రాబోతుంది. ప్రస్తుతం థియేటర్లలో సినిమాలు లేకపోవడం 'ఎఫ్ 2' హవా కూడా కాస్త తగ్గుతుండడంతో ఈ సినిమాకి  అడ్వాంటేజ్ అవుతుందని భావిస్తున్నారు. మరి ఏ మేరకు ఈ సినిమా సక్సెస్ అందుకుంటుందో చూడాలి!